జాతీయ వార్తలు

ప్రాంతీయ పార్టీలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: జాతీయ రాజకీయాలను ఇక మీదట ప్రాంతీయ పార్టీలు శాసిస్తాయని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే. తారక రామారావు జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పినట్లు ప్రాంతీయల హవా కొనసాగుతుందని అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో దేశాన్ని ముందుకు నడిపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. దేశంలో జాతీయ పార్టీలు కనుమరుగై పోతున్నాయని, భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదేనని ఆయన ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన 2020-21 బడ్జెట్ తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్నాయం చేసిందని రామారావు ఆరోపించారు. కేటీఆర్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్‌కు హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఇంకా రావలసిన రెండున్నర వేల కోట్ల జీఎస్‌టీ బకాయిలను వీలున్నంత త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి విజప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి రావలసిన ఐదు వేల కోట్ల జీఎస్‌టీ బకాయిల గురించి స్వయంగా గుర్తుచేశారని అన్నారు, ముఖ్యమంత్రి చెప్పిన తరువాత కూడా కేంద్రం కేవలం రెండున్నర వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆయన విమర్శించారు. జీఎస్‌టీ విషయంలో ప్రధాన మంత్రి స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణకు ఇవ్వవలసినదంతా ఇచ్చామంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఏం ఇచ్చారంటూ ఆయన కేంద్ర మంత్రిని
ప్రశ్నించారు. తెలంగాణకు ఇవ్వవలసిన దాటికంటే ఎక్కువ ఇచ్చామనటం ఎంత మాత్రం నిజం కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ ఇలా మాట్లాడటం ఎంత మాత్రం మంచిది కాదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించింది రెండు లక్షల డెబ్బై ఐదువేల పైచిలుకు ఉంటే కేంద్రం నుండి తెలంగాణకు ఇచ్చింది కేవలం ఒక లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, ఈ లెక్కన ఒక లక్షా అరవై వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉన్నదనేది మరిచిపోరాదని ఆయన చెప్పారు. తెలంగాణ పన్నుల రూపంలో ఇచ్చేది ఏక్కువ, కేంద్రం నుండి అందే సహాయం చాలా తక్కువ అని రామారావు చెప్పారు. దేశం నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో ఇస్తోంది ఎంతో అధికమన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తామేదో తెలంగాణకు ఇచ్చామని కేంద్ర మంత్రి చెప్పటం మంచిది కాదని, పద్ధతి కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. తానిప్పుడు చెబుతున్న విషయాలను అవసరమైతే పార్లమెంటులోకూడా టీఆర్‌ఎస్ చెబుతుందని ఆయన ప్రకటించారు. స్త్రుతం దేశంలో జాతీయ పార్టీలు అనేవేవీ లేదు, ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాలను నడిపిస్తున్నాయని రామారావు తెలిపారు. దక్షిణాదిలో కర్నాటక మినహా మరే ఇతర రాష్ట్రంలో జాతీయ పార్టీలు అధికారంలో లేవన్నారు. దేశంలో ఇక మీద ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలపడతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ఫెడరల్ స్పూర్తితో రాజకీయాలు కొనసాగే రోజు వస్తుందని రామారావు జోస్యం చెప్పారు. టైమ్స్‌నావ్ సమ్మిట్‌లో ఫెడరల్ వ్యవస్థ, కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక తదితర పరిస్థితుల గురించి చర్చించినట్లు కేటీఆర్ వివరించారు. ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై కూడా తన అభిప్రాయాలను వివరించానన్నారు. కేంద్రం మరింత ఉదారంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వటం ద్వారా దేశం, రాష్ట్రాల అర్థికాభివృద్దికి తోడ్పడాలని తాను సూచించినట్లు చెప్పారు. కేంద్ర వాణిజ్య, రైల్వే శాఖ మంత్రి పియూష్ గొయల్‌తో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. పియూష్ గోయల్ ఈ నెల 18 తేదీనాడు హైదరాబాదులో జరుగుతున్న ఒక సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్నారని, అప్పుడు కూడా ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి చర్చిస్తానని అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వానికి అంశాల వారిగా సమర్థించాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటున్నామన్నారు. సీఏఏను వ్యతిరేకించినట్లే మరి కొన్నింటిలోకేంద్రం నిర్ణయాలను వ్యతిరేకస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కలిసి వచ్చే విషయంలో సమర్థిస్తున్నామని వివరించారు. కేంద్రంతో ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం వ్యవహరించే విధానాన్ని కొనసాగిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
*చిత్రం... టైమ్స్‌నౌ సమ్మిట్‌లో మాట్లాడుతున్న తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్