జాతీయ వార్తలు

మా ప్రగతి పర్యావరణ హితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/గాంధీనగర్, ఫిబ్రవరి 17: పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అభివృద్ధి లక్ష్యాలను సాధించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపరంగా కూడా అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. ఉష్ణోగ్రతల స్థాయిని రెండు డిగ్రీల సెల్షియస్ కంటే తక్కువగా ఉంచాలన్న ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి పనిచేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని మోదీ తెలిపారు. గాంధీనగర్‌లో సోమవారం జరిగిన ఓ పర్యావరణ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ ‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి, పచ్చదనంతో కూడిన అభివృద్ధే ఆశయంగా భారత్ పనిచేస్తోంది. పర్యావరణ పరమైన సానుకూల చర్యలను తీసుకుంటోంది’ అని తెలిపారు. భారతదేశం సాంప్రదాయకంగా అతిధిదేవోభవ అన్న ఆశయంతోనే పనిచేస్తోందని, తాము తీసుకుంటున్న ఈ చర్యలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో భారత్ తన అనుబంధాన్ని పెంచుకుంటోందని మోదీ తెలిపారు. ఇండో-పసిఫిక్ కార్యాచరణలో భాగంగా ఈ విషయంలో భారత్ క్రియాశీలక భూమిక పోషిస్తోందని అన్నారు. వణ్యప్రాణుల పరిరక్షణకు కూడా అన్ని దేశాలు సమన్వయం, సహకారంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉమ్మడి కృషి వల్ల వలస పక్షులు సహా అన్ని జీవజాతులను సమాదరణతో రక్షించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలోని అనేక రక్షిత ప్రాంతాలకు ఇతర దేశాలతో ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయని మోదీ తెలిపారు. 2014లో 745 ఉన్న రక్షిత ప్రాంతాలు 2019 నాటికి 870కి పెరిగాయని, వీటి విస్తీర్ణం 1.70 లక్షల చదరపు కిలోమీటర్లని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ సిటీలు, నీటి సంరక్షణ వంటి ఆశయాల సాధనకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. తరతరాలుగా వణ్యప్రాణి సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ భారత సంస్కృతిలో భాగమని, ఆదరణ, సహజీవనమే భారతీయ పునాది అని మోదీ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత వైవిధ్యం భారత్‌కు ఉందని గుర్తు చేసిన మోదీ ‘మొత్తం ప్రపంచ భూభాగంలో 2.4 శాతం భారత్‌కు ఉంది. అలాగే, అంతర్జాతీయ జీవ వైవిధ్యంలోనూ 8 శాతం వాటా భారత్‌దే’ అని తెలిపారు. అత్యంత వైవిధ్యమైన పర్యావరణ ఆవాసాలు కూడా భారత్‌లో ఉన్నాయని, ప్రధానంగా తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఇండో-మయన్మార్ భూతల ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు ఇందుకు ఉదాహరణలని మోదీ తెలిపారు. వీటితోపాటు 500 అరుదైన వలస పక్షి జాతులకు భారతే ఆవాసమని, దేశంలో పులుల సంఖ్య పెరిగిందని మోదీ స్పష్టం చేశారు. పులుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ కలసికట్టుగా కృషి చేయాలని కోరారు.