జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ క్రీడా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కేంద్ర క్రీడా శాఖ మత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం తన నివాసంలో కిరణ్ రిజిజు, కార్యదర్శి రాధేశ్యాం జలానియాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న వివిధ క్రీడా ప్రాజెక్టుల నిర్మాణం పని తీరును సమీక్షించారు. క్రీడా పథకాల అమలును సమీక్షించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉప రాష్టప్రతి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న క్రీడా ప్రాంగణాల పని తీరు గురించి అడిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో బహుళార్దక అంతర్ క్రీడల కేంద్రం, విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో బహుళార్దక ఆంతర్ (ఇండోర్) హాల్ నిర్మాణం, విశాఖపట్నంలో కొమ్మడి మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడాప్రాధికార కేంద్ర మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాలీ ఫీల్డ్ ఏర్పాటు చేయటంతో పాటు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వసతుల ఏర్పాటు తదితర అంశాలపై వివరాలు అడిగారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ఇండోర్ స్టేడియంలతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామనీ అయితే నిధుల వినియోగ వివరాలు (యూటిలైజేషన్ సర్టిపికేట్లు) రావడం ఆలస్యమవుతున్నందున తదుపరి పనులు అలస్యమవుతున్నాయని మంత్రి కిరణ్ రెజీజు వివరించారు. దీనికి ఉప రాష్ట్రపతి స్పందిస్తూ వినియోగ సర్ట్ఫికేట్లను వీలున్నంత త్వరగా తెప్పించుకుని వీలైనంత త్వరగా మిగతా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశం మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులుతో మాట్లాడి వినియోగ సర్ట్ఫికేట్ల గురించి వాకబు చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక వసతులున్నాయి కాబట్టి అక్కడ జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి సద్వినియోగపరచుకోవాలని ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రికి సూచించారు. దేశంలో క్రీడారంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ చేస్తున్న కృషిని ఉప రాష్టప్రతి ప్రశంసించారు. క్రీడాభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రైవేట్ సంస్థలు కూడా స్వచ్చందంగా భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రికి హితవు చెప్పారు. మానవ వనరుల అభివృద్ది, పెట్రోలియం శాఖతో పాటు పలు ఇతర శాఖలు దేశంలో క్రీడాభివృద్ది కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు తమ వంతు సహాయ, సహకారాలు అందించేలా చర్చలు జరపాలని కిరణ్ రిరెజీజుకు ఉప రాష్టప్రతి సూచించారు. విశ్వ విద్యాలయాలు, కళాశాలలు కూడా క్రీడలను ప్రోత్సహించాలి దీని కోసం ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందించుకోవాలని వెంకయ్య నాయుడు చెప్పారు.

*చిత్రం... ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు