జాతీయ వార్తలు

అంకెల గారడీ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 18: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. బడ్జెట్‌కు చూస్తే ప్రభుత్వానికి స్పష్టతం ఉన్నట్టు కనిపించడం లేదని, ఒక విధంగా ప్రజలను దగా చేసేదిగా ఉందని విపక్షం విరుచుకుపడింది. రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ ప్రభుత్వం వంచిందని ఆరోపించింది. ట్రియల్ డాలర్ ఆర్థిక వ్యవస్థ ఎలాగో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. రైతులు, యువత, మహిళలకు బడ్జెట్ వల్ల వొనగూరేది ఏమీలేదని కాంగ్రెస్ విమర్శించింది. బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉందని, గత ఏడాది బడ్జెట్‌కు దీనికి తేడా ఏమీలేదని బహుజన జమాజ్‌వాదీ పార్టీ ధ్వజమెత్తింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 5,12,860.72 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అందులో అయోధ్యంలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి 500 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే రూ. 33.159 కోట్ల రూపాయలు ఎక్కువ. ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలకు రూ. 10,967.87 కోట్ల రూపాయలు కేటాయించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేతి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. రైతులు, యువత, మహిళలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. బీజేపీ చెబుతున్న ట్రియల్ డాలర్ల ఎకానమీ ఇదేనా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అంకెలకు పొంతనలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారమేనని, ప్రజలను యోగి సర్కార్ మోసం చేసిందని ఎస్పీ అధినేత అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంవోయూలు ఆడంబరంగా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదని అఖిలేష్ తెలిపారు. పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు, అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించి వివరాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. ‘మేం అధికారంలో ఉండగా ఏం చేసింది మీరొచ్చాక వొనగూరింది ఏమిటి అన్న విషయం ప్రజలకు అర్థమైంది‘అని ఆయన పేర్కొన్నారు. గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ హైవే, మెట్రో, ల్యాప్‌టాప్ పంపిణీ వంటి పథకాలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పథకాలను మార్చడమే తప్ప ఏమీ లేదని ఎస్పీనేత విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు, కస్టడీ మరణాలు, ఆందోళనకారులపై కాల్పులు పెరిగాయని ఆయన చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన ఆరోపించారు. తమ బడ్జెట్ చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మాటలే తప్ప పనులు శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని అన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఓ ప్రహానంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. 22 కోట్ల మంది ప్రజల సంక్షేమం యోగి సర్కార్ గాలికొదిలేసిందని ఆమె ఆగ్రహించారు. గత ఏడాది బడ్జెట్‌లాగే ఇదీ ఉందని మాయావతి విమర్శించారు. హామీలు అమలుకు ఏం చర్యలు తీసుకున్నదీ, కేటాయింపులు ఏమిటి అన్నదానిపై స్పష్టత లేదని, కేంద్ర బడ్జెట్ తంతులాగే ఉందని బీఎస్పీ అధినేత్రి స్పష్టం చేశారు. యోగి ప్రభుత్వం బడ్జెట్‌కు దశదిశా లేదని కాంగ్రెస్ మండిపడింది. బడ్జెట్ అంకెల గారడీ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ విమర్శించారు. మహిళల భద్రతకు అరకొర కేటాయింపులు జరిగాయని అన్నారు. యువత, రైతులు, పేద ప్రజలకు మొండిచేయి చూపారని ఆయన ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రవేశమెట్టిన నాలుగో వార్షిక బడ్జెట్ ఇది.