జాతీయ వార్తలు

‘గాంధీ’లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 20: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబానికి చెందని వారిని ఎన్నుకోవాలనే డిమాండ్ పార్టీలో పుంజుకుంటోంది. సోనియా గాంధీ స్థానంలో కొత్త వారిని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలి, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాకుండా బయటి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ‘గాంధీ కుటుంబానికి చెందని వారిని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలంటూ సందీప్ దీక్షిత్ చేసిన డిమాండ్‌ను చాలా మంది కాంగ్రెస్ నాయకులు బలపరుస్తున్నార’ని లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి సోనియా గాంధీ స్థానంలో కొత్త వారిని ఎన్నుకునే అంశంపై పార్టీలో గొడవ గురువారం మరింత ముదిరింది. మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటూ కొందరు యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో సందీప్ దీక్షిత్, శశిథరూర్ తదితర నాయకులు గాంధీ కుటుంబానికి చెందని వారిని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలనటం సంచలనం సృష్టించింది. సోనియా గాంధీ ఎక్కువ కాలం కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు, పార్టీకి పూర్తి సమయం ఇవ్వలేకపోతున్నారు, ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబేరుల్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే పార్టీ త్వరలోనే కనుమరుగైపోతుందంటూ మాజీ ఎం.పీ సందీప్ దీక్షిత్, లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ తదితరులు బహిరంగ ప్రకటనలు చేయటం కాంగ్రెస్‌తోపాటు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని శశిథరూర్ ట్వీట్టర్ ద్వారా గురువారం డిమాండ్ చేశారు. ‘పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి సమర్థంగా నిర్వహించగలిగే సమర్థత ఉన్న గాంధేతర నాయకులు కాంగ్రెస్‌లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉన్నారు, పార్టీని నడిపించే అవకాశం వారికి ఇవ్వాల’ని సందీప్ దీక్షిత్ గురువారం ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. వీలున్నంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోకపోతే కాంగ్రెస్ కుప్పకూలుతుందని హెచ్చరించారు. సందీప్ దీక్షిత్ చేసిన ఈ ట్వీట్‌కు శిశిథరూర్ వెంటనే స్పందిస్తూ కాంగ్రెస్‌కు
కొత్త అధ్యక్షడిని సత్వమే ఎన్నుకోవటం మంచిదనే అభిప్రాయాన్ని సందీప్ దీక్షిత్ బహిరంగ పరిచారు. ‘అధిక శాతం కాంగ్రెస్ నాయకులు లోలోపల ఇదే డిమాండ్ చేస్తున్నారు, అయితే వారు తమ అభిప్రాయాన్ని బహిరంగ పరచలేకపోతున్నార’ని థరూర్ తన ట్వీట్‌లో పేర్కొనటం గమనార్హం. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు పార్టీలోని అత్యున్నత నిర్ణయాక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వెంటనే సమావేశం కావాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత కూడా పార్టీ వ్యవహారాల్లో అధ్యక్షుడి మాదిరిగా జోక్యం చేసుకుంటున్నారు, తన ఇష్టానుసారం ట్వీట్లు జారీ చేస్తూ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ‘రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించాం. అయితే ఆయన మా అంచనాలకు విరుద్దంగా ప్రతి రోజూ పార్టీ వ్యవహారాల్లో అధ్యక్షుడి మాదిరిగా జోక్యం చేసుకుంటున్నారు, దీని వలన పార్టీలో తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొన్నద’ని ఏఐసీసీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోకుండా అధికారం చెలాయించటం వలన సీనియర్ నాయకులు సైతం గందరగోళంలో పడిపోతున్నారని వారంటున్నారు. సోనియా గాంధీ కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా మాత్రమే పని చేస్తున్నారు, అనారోగ్యం మూలంగా ఆమె పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా పని చేయటం, కొనసాగేందుకు ఇష్టపడటం లేదు, ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడిను ఎన్నుకోవలసిన అవసరం ఎంతో ఉన్నదని వారు వాదిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు కొత్త అధ్యక్షుడి ఎంపికకు అడ్డుపడుతున్నారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా బయటి వారు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే తమ రాజకీయాలకు తెర పడుతుందనే భయంతో ఈ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని ఒక సీనియర్ నాయకుడు ఆరోపించారు. కొత్త అధ్యక్షుడిని త్వరగా ఎన్నుకోవాలని సోనియా గాంధీ కూడా పలుమార్లు స్పష్టంగా చెప్పినా సీనియర్ నాయకులు పట్టించుకోవటం లేదని సందీప్ దీక్షిత్ ఆరోపించినట్లు తెలిసింది.