జాతీయ వార్తలు

ఆర్టికల్ 371ను రద్దుచేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈటానగర్: కేంద్రలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆర్టికల్ 317ను రద్దుచేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న కథనాలను గురువారం ఇక్కడ తోసిపుచ్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని పరిరక్షించాలన్న చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాజ్యాంగలోని ఆర్టికల్ 371 కింద అనేక రాష్ట్రాలు ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నాయని అందులో ఈశాన్య రాష్ట్రాలూ ఉన్నాయని షా పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈటానగర్‌లో ఏర్పాటైన సభలో హోం మంత్రి మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాకే ఈశాన్య రాష్ట్రాలకు భౌగోళింకగా గుర్తింపువచ్చిందని ఆయన చెప్పారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదని అమిత్ షా విమర్శించారు. ‘ఇక్కడి ప్రజల భావోద్వేగాలు మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మార్గం సుగమం అయింది’అని ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసినట్టే 317ని రద్దు చేస్తారన్న తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, 371 ఆర్టికల్‌ను రద్దుచేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి లేదని ఆయన భరోసా ఇచ్చారు. ‘ఆర్టికల్ 371 రద్దు ఉద్దేశమే లేదు. అది ఎప్పటికీ జరగదు’అని ఆయన అన్నారు. తీవ్రవాదం, అంతర్‌రాష్ట్ర సరిహద్దు వివాదం పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని హోం మంత్రి చెప్పారు. ఈ దశగా కేంద్రం చర్యలు తీసుకుందని ఆయన ప్రకటించారు. తీవ్రవాద సంస్థలతో సంప్రదింపులు ఇప్పటికే మొదలయ్యాయని, శాంతి స్థాపనకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అమిత్ షా తెలిపారు. ఇటీవల జరిగిన బోడో ఒప్పందాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. మణిపూర్‌లో దీర్ఘకాలంగా ఉన్న బ్రూ-రియాంగ్ సమస్య ఒప్పందం ద్వారా పరిష్కారమైందని ఆయన పేర్కొన్నారు. ‘మీరు 2024లో మరోసారి మాకు ఓటేసి గెలిపిస్తే ఈశాన్య రాష్ట్రాలను తీవ్రవాద, సరిహద్దు వివాదాల రహితంగా మారుస్తాం’అని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి ప్రకటించారు. ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 30 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లోనే పర్యటించారని, దాన్నిబట్టే సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని హోం మంత్రి వ్యాఖ్యానించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో 13వ ఆర్థిక సంఘం కింద ఈశాన్య రాష్ట్రాలకు కేవలం 89,168 కోట్ల రూపాయలే కేటాయించారని ఆయన విమర్శించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం కింద రూ. 3,13,374 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అమిత్ షా తెలిపారు. ఈశాన్య కౌన్సిల్(ఎన్‌ఈసీ)కింద 474 కొత్త పథకాలు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో రూ. 32,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల పథకాలున్నాయన్నారు. 2024కు ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాజధానులకు రహదారి, విమానయాన సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత పాతికేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లో రహదారుల నిర్మాణానికి రూ. 47,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే, గత ఐదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం 50వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని అమిత్ షా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు మూడు కొత్త రైల్వే లైన్లు వేయనున్నామని దాని కోసం సర్వే నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని షా ప్రశంసించారు. రాష్ట్రంలో రూ. 400 కోట్లతో ఐఐటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో నూతన పారిశ్రామిక, పెట్టుబడుల పాలసీని ఆయన ప్రకటించారు. చైనా సరిహద్దు రాష్టమ్రై అరుణాచల్ ప్రదేశ్ ప్రజల్లో దేశ భక్తి ఎక్కువని ఆయన పొగిడారు.‘కొన్ని రాష్ట్రాల్లో నమస్తే అంటూ పరస్పరం పలకరించుకుంటారు. కొన్ని చోట్ల రామ్ రామ్ అంటారు. గుజరాత్‌లో కెం చో అంటారు. అయితే మీరు(అరుణాచల్ ప్రజలు) జైహింద్ అని పరస్పరం చెబుతుంటే మీలో దేశ భక్తి ఎంతో చెప్పవచ్చు’అని హోం మంత్రి అన్నారు. కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్, కిరెన్ రిజిజూ హాజరయ్యారు.

*చిత్రం... హోం మంత్రి అమిత్ షా