జాతీయ వార్తలు

నేషనాలిటీ అందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 20: నేషనలిజం అంటే నాజిజం, ఫాసిజంను గుర్తుకు తెస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కాబట్టి నేషనలిజం పదం మానేసి నేషనాలిటీ అంటే బావుంటుందని కార్యకర్తలకు ఆయన సూచించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ నియంతలైన హిట్లర్ పాలనను ఫాసిజం, నాజియిజంగా చెబుతుంటారు. నేషనలిజం కూడా ఆ పదాలనే స్ఫూరణకు తెస్తున్నందున ఆర్‌ఎస్‌ఎస్ అధినేత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. హిందుత్వ నేషనలిజం అన్నది తమకు హానికరమైందిగా ముస్లింలు భావిస్తున్నారని భగవత్ చెప్పారు. అందుకే నేషనాలిటీ అనాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. భగవత్ తన ప్రసంగంలో ఓ విషయాన్ని ప్రస్తావించారు. సంఘ్ వలంటీర్ ఒకరు తనకో సలహా ఇచ్చారన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అదేంటో చెప్పుకొచ్చారు. తాను బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు కార్యకర్త ఓ సలహా ఇచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను యూకే పర్యటనలో ఉన్నాను. మీరు యూకేలో నేషనలిజం అనొద్దు. ఎందుకంటే ఇంగ్లండ్‌లో దానికి వేరే అర్థం ఉంటుంది. ఆ పదంను ఆ దేశంలో మరోలా అర్థం చేసుకుంటారు. హిట్లర్, నాజీయిజం, ఫాసిజంగానే నేషనలిజంను చూస్తారు. కాబట్టి ఇంగ్లిష్‌లో నేషన్, నేషనల్, నేషనాలిటీ అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు‘అని వలంటీర్ తనతో అన్నారని భగవత్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతే అని ఆయన ఉద్ఘాటించారు. అతివాదం, వాతావరణ మార్పు వల్ల ప్రపంచంలో అశాంతి నెలకొందని ఆయన చెప్పారు. అయితే భారత్‌లో దీనికి భిన్నమైన వాతావరణ ఉంటుందని ఆయన తెలిపారు. భిన్నవైఖరులు ఉన్నప్పటికీ భారత్‌లో అందరూ కలిసిమెలిసి ఉంటారని భగవత్ పేర్కొన్నారు. అనేక సంక్లిష్టమైన సమస్యలకు భారత్‌లో పరిష్కారాలు దొరుకుతాయని ఆయన వెల్లడించారు. వివిధ భాషలు, మతాలు, ప్రాంతాలతో దేశం సుభిక్షంగా ఉంటోందని ఆయన చెప్పారు. ప్రపంచం భారత్ వైపే చూస్తోందన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అది జాతి గొప్పతనం అన్నారు. ‘మనదంతా వసుదైక కుటుంబం. మనం ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం. అందరి కోసం అందరం జీవిస్తాం. అంతే తప్ప ఎవరికి వారు కాదు’అని మోహన్ భగవత్ తెలిపారు. ఆయన మరొక ఉదాహరణ ఇచ్చారు. ‘ భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన ఓ ముస్లిం మేధావి మెడలో లాకెట్ వేసుకున్నాడన్న కారణంతో దైవదూషణ అభియోగం మోపారు. ఆయననను అక్కడ జైలులో పెట్టారు.
దీనిపై అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆ ప్రభుత్వంతో మాట్లాడిన సుష్మా వారం రోజుల్లో ముస్లిం మేధావిని విడుదల చేయించారు. దీని అర్థం భారతీయులందరూ ఒక్కటే మాకు ఎలాంటి వివక్ష ఉండడదని చెప్పడం’అని ఆయన అన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, విలువలుతో కూడిన వ్యవస్థ హిందూ సమాజానిదని భగవత్ స్పష్టం చేశారు.

*చిత్రం... రాంచీలో గురువారం జరిగిన సంఘ్ సమాగం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్