జాతీయ వార్తలు

తృటిలో ప్రాణాలతో బయటపడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: ‘భారతీయుడు-2’ చిత్రీకరణ సందర్భంగా క్రేన్ విరిగిన పడిన ఘటనను నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని వెటరన్ నటుడు కమల్‌హసన్ గురువారం స్పష్టం చేశారు. బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన ప్రమాద ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం తనను కలచి వేసిందనీ.. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కోటి రూపాయిల సహాయం అందిస్తానని కమల్ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. కేవలం మూడు నాలుగు సెకండ్ల గ్యాప్‌లో అక్కడి నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాననీ.. దర్శకుడు శంకర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని ఆయన వివరించారు. ‘నాతో పాటు శంకర్, కెమెరామెన్, హీరోయిన్ కాజల్ అగర్‌వాల్ కొద్ది సెకండ్ల తేడాతో అక్కడి నుంచి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాం’ అని కమల్ పేర్కొన్నారు. ‘నేను ఆ సమయంలో అక్కడి నుంచి కదలి ఉండకపోతే నా స్థానంలో మరొకరు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉండేవారు’ అంటూ మక్కల్‌నిధి మయం పార్టీ చీఫ్ కూడా అయిన కమల్‌హసన్ ఉద్వేగంతో మాట్లాడారు. ‘ప్రమా దం అనేది ఓ సునామీ లాంటిది.. దానికి పేద, ధనిక తేడా ఉండదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘తమిళ సినిమా పరిశ్రమ సహా ఏ పరిశ్రమ అయినప్పటికీ అందులో పనిచేసే కార్మికుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా’నని కమల్ కోరారు. సినీ పరిశ్రమ పరిరక్షణకు ఒక యంత్రాంగం అవసరం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నై సమీపంలోని నజ్రత్‌పేట్‌లోని ఫిలిం సిటీలో శంకర్ దర్శకత్వంలో‘్భరతీయుడు-2’ చిత్రీకరణ సందర్భంగా క్రేన్ విరిగి పడిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్రేన్ ఆపరేటర్ పరారీలో ఉన్నాడనీ.. అతనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని అంతమొందించాలనే కథనంతో నిర్మించిన భారతీయుడు సినిమా 90వ దశకంలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2ను నిర్మిస్తున్నారు.

*చిత్రం...మక్కల్‌నిధి మయం పార్టీ చీఫ్, వెటరన్ నటుడు కమల్‌హసన్