బిజినెస్

పీఎం-కిసాన్ కింద రూ.50 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి- కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులకు రూ. 50,850 కోట్లు పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహావసరాల కోసం ఈ డబ్బును వినియోగించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకం అమలులోకి వచ్చి ఫిబ్రవరి 24వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ పథకం పురోగతిని వివరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత సంవత్సరం ఫిబ్రవరి 24న పీఎం-కిసాన్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధిక ఆదాయం ఉన్న వారిని మినహాయించి దేశ వ్యాప్తంగా గల రైతులకు ఒక్కొక్కరికి కేంద్రం ఏడాదికి రూ.6వేల చొప్పున నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా బదిలీ చేస్తుంది. ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి అనే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రారంభమయి 2020 ఫిబ్రవరి 24 నాటికి ఏడాది పూర్తవుతుంది’ అని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. దేశ వ్యాప్తంగా గల రైతులకు వారి వ్యవసాయ ఖర్చులు, గృహావసరాల వ్యయం విషయంలో ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు వివరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 50,850 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది’ అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద సుమారు 14 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేది నాటికి 8.46 కోట్ల రైతు కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందాయి. ఈ పథకాన్ని 2018 డిసెంబర్ నుంచే వర్తింపచేస్తున్నారు. 2019 ఫిబ్రవరి ఒకటో తేది నాటికి లబ్ధిదారులను గుర్తించారు.