జాతీయ వార్తలు

ఆత్మపరిశీలన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 22: ప్రస్తుత సమాజంలో కొత్త మాధ్యమం ఇంటర్నెట్( అంతర్జాలం), సోషల్ మీడియా( సామాజిక మాధ్యమం) దూసుకొచ్చిందని, ఈ పరిస్థితుల్లో సాంప్రదాయ మాధ్యమం తన పాత్రపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ‘కొత్త మీడియా వేగంగా దూసుకెళ్తూ ప్రజాదరణ పొందుతోంది. ప్రజలకు ఏ మీడియాను ఎంచుకోవాలి? దేన్ని చూడాలి, ఏది వినాలి అనే అవకాశం వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే సాంప్రదాయ మీడియా అభివృద్ధి చెందుతూ వచ్చిందని, నైపుణ్యానికి పదునుపెట్టుకుంటూ ఉందని ఆయన చెప్పారు. వార్తా సేకరణ అన్నది నేడు అత్యంత ఖరీదైపోయిందని కోవింద్ తెలిపారు. ఓ ఆంగ్ల దినపత్రిక ఎడిషన్ ప్రారంభ కార్యక్రంలో రాష్టప్రతి మాట్లాడారు. మరింత మంది పాఠకులు పత్రికలు చదివేలా, వారి విశ్వాసాన్ని చూరగొనేలా సాంప్రదాయ మాధ్యమం కృషి చేయాల్సి ఉందని ఆయన నొక్కిచెప్పారు. నిష్పాక్షికమైన జర్నలిజం మనగలుగుతుందన్న రాష్టప్రతి ప్రజలకు అలాంటి సమాచారం అందించకపోతే ప్రజాస్వామ్యం అసంతృప్తిగా మిగిలిపోతుందన్నారు. శరవేగంగా దూసుకొచ్చిన ఐటీ విప్లవం జర్నలిజంలోని అన్ని విభాగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిందని రాష్టప్రతి పేర్కొన్నారు.
వార్తల సేకరణ, పాఠకులకు అందజేత అన్నీ అధిక వ్యయంతో కూడుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయ మీడియానే విశ్వసనీయమైంది, అలాగే ప్రామాణికమైంది అని ఆయన ఉద్ఘాటించారు.