జాతీయ వార్తలు

ట్రంప్ పర్యటనకు వంద కోట్ల ఖర్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దాదాపు వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆమె అన్నారు. అహమ్మదాబాద్‌లోని మెతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమ నిర్వహణకు ఓ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీలో సభ్యులెవరో ఎవరికీ తెలియదని ప్రియాంక అన్నారు. ఖర్చు మాత్రం ఈ కమిటీ పేరుతోనే జరుగుతోందని అన్నారు. ఈ కమిటీకి ఇంత భారీ మొత్తాన్ని ఏ మంత్రిత్వ శాఖ అందించిందో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ కమిటీ పేరుతో ప్రభుత్వం దాస్తున్నది ఏమిటి? అని మండిపడ్డారు. అహమ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ‘నాగరిక్ అభినందన్’ కమిటీ నిర్వహిస్తోంది. ఇదిలావుండగా, కాం గ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ఈ కమిటీపై మండిపడ్డారు. ఈ కమిటీ సభ్యులెవరని మోదీని ఆయన ప్రశ్నించారు. అసలు అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడు ఆహ్వానం పలికారు, ఆయన ఎప్పుడు అంగీకరించారని ఆయన ప్రశ్నించారు. గుర్తు తెలియని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహించే మూడు గంటల కార్యక్రమానికి 120 కోట్లు ఖర్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. అయితే, ట్రంప్ పర్యటన భారత్‌కు ప్రయోజనం కలిగే వినియోగించుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలని అన్నారు.