జాతీయ వార్తలు

ఆతిథ్యానికి ఐటీసీ వౌర్య సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు ఢిల్లీలోని ఐటీసీ వౌర్య రెస్టారెంట్ ‘బుఖారా’ ఆతిధ్యమిస్తోంది. గతంలో అనేక మంది అతిరథ మహారధులు, దేశాధినేతలు ఇక్కడ బస చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీసమేతంగా రెండు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షులు బుఖరా ఆతిధ్యం తీసుకున్నారు. ట్రంప్ ఐకాన్ రెస్టారెంట్‌లో విందు చేయనున్నారు. అయితే అధ్యక్షుడి మెనూ లేదా ఏర్పాట్ల గురించి హోటల్ యాజమాన్యం బయటకు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. బరాక్ ఒబామా 2010, 2015లో భారత్‌లో పర్యటించారు. ఆయన బుఖరాలోనే విందు ఆరగించారు. అతిధులకు ఒక ప్రత్యేక పళ్లెం(ప్లాటర్)లో ప్రత్యేక వంటకాలు పేర్చి అందజేస్తారు. ఒబామా తరువాత ప్లాటర్ మెనూకు మంచి పేరొచ్చింది. అప్పట్లో ఒబామా కోసం సిద్ధం చేసిన పళ్లెంలో తండూరి ఝింగా, మంఛ్లీ టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్స్ ఉంచి వడ్డించారు. ఇప్పుడు ట్రంప్‌కు అదే తరహా ఆతిధ్యం ప్లాటర్ సిద్ధమవుతోంది. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా బుఖారాను సందర్శించినప్పుడు క్లింటన్ ప్లాటర్, చల్సియా ప్లాటర్ ఉంచారు. వాటిలోనే రకరకాలైన వంటకాలు, సలాడ్లు ఉంచి వడ్డించారు. బుఖారా రెస్టారెంట్ తండూరి ఆధారిత నోరూరించే వంటకాలకు పెట్టింది పేరు. అలాగే కబాబ్స్ వడ్డిస్తారు. సిగ్నేచర్ దాల్ బుఖారా, ఖాస్తారోటీ, భార్వాన్ కుల్ఛా రొట్టెలు ట్రంప్‌కు అందిస్తారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ చేసిన ఓ ఆప్రాన్ హోటల్ యాజమాన్యం ట్రంప్‌కు బహూకరించనుంది. 2015లో బరాక్ ఒబామా ఐటీసీ వౌర్యలోనే బస చేశారు. ఆయనకు ఇదే రెస్టారెంట్ నుంచి విందు సిద్ధం చేశారు. యురోపియన్ రెస్టారెంట్ ‘వెస్ట్‌వ్యూ’ రూఫ్ టాప్‌పై భారత్, యూఎస్ కంపెనీల సీఈవోలతో కలిసి ఒబామా విందు చేశారు. జనవరి 26న జరిగిన విందుకు ఐటీసీ వౌర్య నుంచే ప్రత్యేక వంటకాలు వెళ్లాయి. ఆ నాటి డిన్నర్ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌లో భారీగా జరిగింది. ఆనాటి ఏర్పాట్లు చూసి ఒబామా భార్య మిషెల్లీ ఒబామా అబ్బురపడ్డారు. ఆనాడు ఎంపిక చేసిన కొందరు వీవీఐపీలతో కలిసి మిషెల్లీ డిన్నర్ చేశారు.