జాతీయ వార్తలు

రాజకీయాలను పక్కన పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, దేశ ప్రయోజనాలను చాటిచెప్పే ప్రయత్నం చేయాలని బీజేపీ స్పష్టం చేసింది. ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను శనివారం నాడు ఇక్కడ తిప్పికొట్టింది. భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటనను ఆశాజనక మలుపుగా భావించాలని, విభేదాలను పక్కనబెట్టి భారత్ సాధించిన విజయాలను ఎలుగెత్తి చాటాలని స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఏకమై దేశం కోసం పనిచేయాల్సిన సందర్భంగా ట్రంప్ పర్యటనను అభివర్ణించింది. ట్రంప్ పర్యటనను అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంగా భావించకూడదని, భారత్‌కు ప్రయోజనాలు కలిగించే విధంగా దానిని మలుచుకోవాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించిన నేపథ్యంలో బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ ప్రతినిధి సందీప్ పాత్రా ‘దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంటే మీకెందుకు అక్కసు’ అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో అత్యంత విస్తృతమైన, ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశాల అధినేతల కలయికగానే ట్రంప్-మోదీ సమావేశాన్ని పరిగణించాలని, ఇందుకు సంబంధించి దేశంలోని అన్ని పార్టీలు ఒక్కతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ పర్యటనను భారత్ సాధించిన విజయాలుగా పరిగణించాలని, అంతే హుందాతనంతో కాంగ్రెస్ వ్యవహరించాలని ఆయన అన్నారు. మోదీ హయాంలో దేశ ప్రయోజనాలకు ఏవిధమైన నష్టం ఉండదని, అమెరికా మైత్రీపటంలో భారత్‌కు అత్యంత కీలకమైన స్థానం ఉందన్న విషయం మరచిపోకూడదని తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ చేస్తున్న కృషి వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ భారత్‌కు సత్సంబంధాలు నెలకొన్నాయని అన్నారు.