జాతీయ వార్తలు

నమస్తే ట్రంప్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత్-అమెరికాల వ్యూహాత్మక బంధం మరో మైలురాయిని అధిగమించబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నుంచి భారత్‌లో జరపనున్న రెండు రోజుల చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక రక్షణ బంధాన్ని వ్యూహాత్మక రీతిలో మలుపుతిప్పే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ పేరిట జరిగే భారీ బహిరంగ సభ ఇరు దేశాల మధ్య నాయకత్వ స్థాయిలోనే కాకుండా ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి కూడా అద్దం పట్టనున్నది. ఈ పర్యటనకు భారత్ అనేక రకాలుగా ప్రాధాన్యతనిస్తోంది. ద్వైపాక్షిక రక్షణ, వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు అనేక రకాలుగా ఇరు దేశాలు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొవడంలో కలిసికట్టుగా సాగేందుకు ఈ పర్యటన దోహదం చేయబోతోంది. ట్రంప్ పర్యటించే అహ్మదాబాద్, ఆగ్ర, దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్యరీతిలో భద్రతా ఏర్పాట్లను చేయడంతో పాటు ఈ విశిష్ట అతిథికి అంతే విశిష్ట స్థాయిలో ఘన స్వాగతం పలికేందుకు భారతావని సిద్ధమైంది. అయితే ఈ పర్యటన అనేక కోణాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ వాణిజ్య సుంకాలు సహా అనేక సంక్లిష్ట అంశాలను పరిష్కరించడంలో ఏ మేరకు దోహదం చేస్తుందన్నది స్పష్టం కావడం లేదు. దాదాపు 36 గంటల పాటు అమెరికా అధ్యక్షుడు జరిపే ఈ పర్యటన ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక భౌగోళిక రాజకీయ అంశాలపై భారత్-అమెరికాల మధ్య భావసారూప్యత ఉందన్న బలమైన సంకేతాన్ని అందించబోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చైనా తన సైనిక, ఆర్థిక ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య సాన్నిహిత్యం అనేక కోణాల్లో ప్రాముఖ్యత కలిగినదే. సోమవారం అహ్మదాబాద్ బహిరంగ సభ, ఆగ్రాలో తాజ్‌మహాల్ సందర్శనతో ట్రంప్ పర్యటన తొలి రోజు ముగుస్తుంది. రెండో రోజైన మంగళవారం ఆయన పర్యటనకు దేశ రాజధాని ఢిల్లీయే కేంద్ర బింధువు కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ మధ్య జరిగే కీలక చర్చల్లో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు, వాణిజ్యం పెట్టుబడులు రక్షణ, భద్రత, ఉగ్రవాద నిరోధన, ఇంధన భద్రత, మత స్వేచ్ఛ వంటి అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. పౌరసత్వ చట్టంపై మోదీ
సర్కారుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసన ప్రదర్శనలు, అదేవిధంగా కాశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్‌తో సమస్యలు మరింత తీవ్రమైన నేపథ్యంలో జరుగుతున్న అమెరికా అధ్యక్షుడి పర్యటన ఆ కోణంలోనూ కీలకమైనదే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రజాస్వామ్యం గురించి, మత స్వేచ్ఛ గురించి ట్రంప్ మాట్లాడే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే భారత్-అమెరికాల మధ్య విబేధాలు ఉన్నప్పటికీ ట్రంప్ పర్యటనను తమ అంతర్జాతీయ వ్యూహాత్మక బంధానికి సంకేతంగానే ఇరు దేశాలు చాటి చెప్పుకునే అవకాశం ఉంది. ఈ పర్యటన సందర్భంగా మేధోసంపత్తి హక్కులు, దేశీయ భద్రత, వాణిజ్య సానుకూలత సహా మొత్తం ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా 2.6 బిలియన్ డాలర్లతో 24 ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు సంబంధించిన ఒప్పందం ట్రంప్ పర్యటనలో కీలకం కానుంది. అలాగే, 800 బిలియన్ల డాలర్లతో ఆరు ఏహెచ్-64ఇ అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కూడా పరిశీలనలో ఉంది. అత్యంత విస్తృతమైన భారతీయ మార్కెట్‌లో తమకు మరింత అవకాశం కల్పించాలని దీర్ఘకాలంగా అమెరికా కోరుతోంది. అయితే ఇందుకు సంబంధించి భారత్ కొన్ని అభ్యంతరాలు తెలపడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. గతం కంటే భిన్నంగా రెండు దేశాల మధ్య అన్ని రకాలుగానూ స్నేహసంబంధాలు బలపడ్డాయని, అలాగే అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల మధ్య భావసారూప్యత కూడా ద్యోతకమవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ 36 గంటల పర్యటనలో భారత దేశ సంప్రదాయ, సాంస్కృతిక వైభవాన్ని అమెరికా అధ్యక్షుడి బృందానికి కళ్ళకు కట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు యావత్ భారత్ ఎదురు చూస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగే చారిత్రక కార్యక్రమంతో ట్రంప్ పర్యటన మొదలవుతుందని, ఆయన రాకను గౌరవంగా భావిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జరిగే 22 కిమీల రోడ్-షోలో ట్రంప్ ప్రధాని మోదీలు పాల్గొంటారు. కొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగుతుంది.

*చిత్రాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ