జాతీయ వార్తలు

ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్), ఫిబ్రవరి 23: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ పాత నగరంలో ఆదివారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు ఆస్తుల దహనానికి, రాళ్లు రువ్వడానికి పాల్పడటంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని అధికారులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పర్ కోట్ ప్రాంతంలో ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్న, భద్రతా సిబ్బందిపైకి రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని అలీగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో మొహమ్మద్ అలీ రోడ్‌పై కొంతమంది మహిళా ఆందోళనకారులు శనివారం నుంచి ధర్నా చేస్తున్నారని, ఆదివారం పోలీసులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడ హింస చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఆదివారం సాయంత్రం అయిదు గంటల సమయంలో కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని అప్పర్ కోట్ ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి ఉన్న మహిళా ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు సమస్య మొదలయిందని ఆయన తెలిపారు. ‘కొంతమంది మహిళా ప్రదర్శకులు ఇప్పటికే ఈద్గా వద్ద నిరసన తెలుపుతున్నారని, అందువల్ల కొత్వాలికి సమీపంలో అలాంటి మరో నిరసనను వ్యక్తం చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగదని మేము వారికి చెప్పాం’ అని సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలోని కొంత మంది ముస్లిం ప్రముఖులతో మహిళలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుండగానే అల్లర్లు మొదలయ్యాయని, భద్రతా బలగాలపైకి ఇటుక రాళ్లు విసరడం ప్రారంభమయిందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని ఆయన వివరించారు. అప్పర్ కోట్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతోందని, శనివారం నుంచి మహిళా ఆందోళనకారులను రెచ్చగొట్టిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన వివరించారు. ఈ ఘర్షణల్లో కొంత మంది గాయపడ్డారని, అయితే, ఎంతమంది గాయపడ్డారనేది ఖచ్చితంగా తెలియదని అధికారులు చెప్పారు.