జాతీయ వార్తలు

నాయకత్వ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రజలలో కాంగ్రెస్ పార్టీ దిక్కూమొక్కూ లేని అసహాయ స్థితిలో ఉందనే భావన అంతకంతకూ పెరుగుతోందని, దీనినుంచి బయటపడటానికి పార్టీ నాయకత్వ సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక అధ్యక్ష పదవి విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించుకోవడం అనేది పార్టీ పునరుజ్జీవనానికి ఎంతో కీలకమని ఆయన ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీ ఇష్టమని ఆయన అన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష పదవిని స్వీకరించాలని కోరుకుంటే స్వీకరించాలని, అలాకాకుండా ఆయన ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకుంటే మాత్రం, పార్టీ ‘క్రియాశీలమయిన, పూర్తి సమయం ఇచ్చే నాయకత్వం’ కోసం వెతకాలని థరూర్ అభిప్రాయపడ్డారు. అప్పుడు మాత్రమే దేశం ఆకాంక్షిస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ పురోగమించగలదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి కొంత మంది సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ద్వారా పార్టీకి క్రియాశీలమయిన నాయకత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ నాయకత్వం పరస్పరం కలిసి పార్టీ సంస్థాగతంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘విభజన విధానాలకు’ అనివార్యమయిన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని థరూర్ నొక్కి చెప్పారు. ‘మాలో అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్న తక్షణ సమస్య ఏమిటంటే, ప్రజలలో కాంగ్రెస్ పార్టీని దిక్కూమొక్కూ లేని రాజకీయ సంస్థగా చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
దీనివల్ల సహజంగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కొంతమంది ఓటర్లు ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారని ఆయన అన్నారు. దీనికి తాజా ఉదాహరణను ఢిల్లీలో చూడవచ్చని, ఇక్కడ ఓటర్లు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎంచుకున్నారని, స్వల్ప సంఖ్యలో బీజేపీని ఎంచుకున్నారని, దీంతో కాంగ్రెస్ పార్టీ శూన్యంగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అసహాయ స్థితిలో ఉందనే భావనను అత్యవసరంగా తొలగించవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎన్నికయిన సభ్యుల కేటగిరి ఉందని, ఈ కేటగిరిలోని వారిని కూడా ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తోందని, అలా కాకుండా ఈ కేటగిరిలోని వారికి నిజంగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని థరూర్ అన్నారు.
*చిత్రం... సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్