జాతీయ వార్తలు

ట్రంప్ ముందు దేశ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఢిల్లీలో అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత దేశం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. భారత దేశం పరువు, ప్రతిష్టను దెబ్బ తీసే వారిని ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టమని కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈశాన్య ఢిల్లీలో సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలను ఆయన ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనారిటీ ముస్లింలు ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, వౌజ్‌పూర్, గోకుల్‌పురి ప్రాంతంలో రోడ్లపై ధర్నాకు దిగారు. సీఏఏను వ్యతిరేకించే పేరుతో రోడ్లను బ్లాక్ చేయటాన్ని పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తున్న వారు అడ్డుకోవడంతో గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా ఒక డీసీపీ తీవ్రంగా గాయపడ్డారు. కిషన్ రెడ్డి ఈ సంఘటనలపై స్పందిస్తూ హింసాత్మక సంఘటనలు సహించేది లేదని స్పష్టం చేశారు. సీఏఏను వ్యతిరేకించే నెపంతో హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను దృష్టిలో పెట్టుకునే జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హింసకు దిగారంటూ ఆయన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ ఖండన
ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు జరగడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారాన్ని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు తమ ధర్నా కార్యక్రమాన్ని అహింసాత్మక పద్ధతిలో జరుపుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, హింసకు దిగవద్దని రాహుల్ గాంధీ సూచించారు. ప్రశాంతంగా ధర్నా జరుపుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. హింసాత్మక సంఘటనలను ఆయన ఖండించారు.
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతోందని సీపీఎం సోమవారం ఓక ప్రకటనలో ఆరోపించింది. బీజేపీ ఢిల్లీ శాఖ నాయకుడు కపిల్ శర్మ ప్రజలను రెచ్చగొట్టడం వల్లనే హింసాత్మక సంఘటనలు చోటుచేసుంటున్నాయని సీపీఎం ఆరోపించింది.