జాతీయ వార్తలు

ఆ ఐదెకరాల్లో మసీదు, ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 24: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుమేరకు వచ్చే ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రిని నిర్మిస్తామని సున్నీ కేంద్ర వక్ఫ్ బోర్డు సోమవారం ప్రకటించింది. అలాగే ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఒకదాన్ని కట్టాలని ఇక్కడ జరిగిన బోర్టు సమావేశంలో నిర్ణయించారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిరం నిర్మాణానికి ఇచ్చిన సుప్రీం కోర్టు నగరంలోనే విలువైన ఐదెకరాల భూమి ముస్లింలకు కేటాయించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పుద్వారా తమకు సంక్రమించే భూమిలో మసీదు, ఆసుపత్రి, ఇండో-ఇస్లామిక్ రీసెర్చీ సెంటర్, లైబ్రరీని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఫరూఖీ మీడియాకు తెలిపారు. ‘ఐదెకరాల స్థలంలో మసీదుతోపాటు ఇండో-ఇస్లామిట్ పరిశోధన కేంద్రం, ప్రజల కోసం ఓ గ్రంథాలయం నిర్మిస్తాం. అలాగే ఖాళీ స్థలంలో ప్రజోపయోగమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని ఆయన ప్రకటించారు. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఎంత స్థలంలో మసీదు నిర్మించాలన్నది నిర్ణయిస్తామని ఫరూఖీ స్పష్టం చేశారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం అంశంపై నవంబర్‌లో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణంపై సుప్రీం కోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలానికి ప్రత్యామ్నయంగా విలువైన ఐదెకరాల స్థలం మసీదు నిర్మాణానికి కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 16వ శతాబ్దం నాటికి అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992లో కరసేవకులు ధ్వంసం చేశారు. మసీదు ఉన్న చోట అంతకు ముందు రామమందిరం ఉండేదని కరసేవకుల ఆరోపణ. దీనిపై సుదీర్ఘకాలం పాటు వాదోపవాదాలు, విచారణలు సాగిన తరువాత గత ఏడాది సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలన్న కోర్టు తీర్పుపై ముస్లిం వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. 2.77 ఎకరాలకు ప్రత్యామ్నయంగా ఇవ్వజూపిన స్థలం తీసుకోవద్దని సున్నీ బోర్డుకు పలువురు సూచించారు. అయితే ఐదెకరాల స్థలం తిరస్కరించడం ప్రత్యామ్నయం కాదని బోర్డు చెప్పుకొచ్చింది. ‘ఐదెకరాల స్థలంలో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడదాం. మసీదుతో పాటు చారిటబుల్ ఆసుపత్రిని అలాగే ఇండో- ఇస్లామిక్ సెంటర్‌ను కటదాం. ఐదెకరాల భూమి వద్దంటే కోర్టు ధిక్కారం అవుతుంది’ అని సున్నీ వక్ఫ్ బోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని బోర్డు చైర్మన్ ఫరూఖీ ముస్లిం వర్గాలకు చెప్పారు. ఆయనతో పాటు మిగతా ఏడుగురు బోర్డు సభ్యులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలానికి ప్రత్యామ్నయంగా సున్నీ బోర్డుకు ఐదెకరాల భూమి సంక్రమించనుంది. ఫిబ్రవరి 5న జరిగిన యూపీ మంత్రివర్గ సమావేశంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.