జాతీయ వార్తలు

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మెలానియా ట్రంప్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. ఓ ప్రభుత్వ పాఠశాలకు తనను ఆహ్వానించడమే కాకుండా అక్కడి విద్యార్థులు పలికిన స్వాగతాన్ని చూసి మురిసిపోయారు.
ఇక అక్కడి పాఠ్యాంశాల విధానాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించకుండా ఉండలేకపోయారు. భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రాథమికోన్నత పాఠశాల ఆహ్వానం మేరకు సోమవారం అక్కడ జరిగిన ‘హ్యాపీనెస్ క్లాస్’ కార్యక్రమానికి మెలానియా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే పాఠ్యాంశాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ‘ఆరోగ్యకర.. సానుకూల దృక్పథం’తో కూడిన పాఠ్యాంశాలు తనకెంతో స్ఫూర్తినిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తొలుత పాఠశాలకు వచ్చిన మెలానియాకు విద్యార్థులు సంప్రదాయ దుస్తులైన గాగ్రా చోళీలు ధరించి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణం అంతా మెలానియాకు స్వాగతం పలుకుతూ పూలతో వేసిన రంగవల్లులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. బ్యాగ్‌పైప్‌ల బ్యాండ్‌తో తనకు స్వాగతం పలికిన విద్యార్థులను అభినందనలతో ముంచెత్తారు. పాఠాశాలలోని విద్యార్థుల రీడింగ్ రూంతో పాటు వారు ఆడుకొనే పరిసరాలను సైతం ఆద్యంతం పరిశీలించారు. అనంతరం మెలానియా మాట్లాడుతూ ‘నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు.. భారత్‌కు నేను రావడం ఇదే మొదటిసారి.. ఇక్కడి ప్రజలు మాకు పలికిన స్వాగతాంజలిని ఎప్పటికీ మరువలేం’ అని పేర్కొన్నారు. ప్రకృతితో సమ్మిళితవౌతూ ఇక్కడి విద్యార్థులు పాఠ్యాంశాలపై దృష్టిపెట్టే విధానం నాకు ఎంతో ఆనందాన్నిస్తోందని ప్రశంసలతో ముంచెత్తారు. భవితకు బంగారుబాట వేసే విధంగా ఉన్న పాఠ్యాంశాలు తనకెంతో నచ్చాయని కితాబునిచ్చారు. భారత్-అమెరికా బంధం మరింత బలపడాలని గుర్తు చేస్తూ ఇరుదేశాల జెండాలతో విద్యార్థులు మెలానియాకు వీడ్కోలు పలుకుతూ చేతితో తయారుచేసిన అనేక బహుమతులతో పాటు మధుబని చిత్రాలను సైతం ఆమెకు అందజేశారు. మెలానియా పాఠశాలకు రావడానికి ముందు ఆ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేయగా.. విద్యార్థులు సైతం ఆమెకు ఏ విధంగా స్వాగతం పలకాలన్న అంశంపై చేసిన రిహార్సల్స్ సైతం అందరినీ ఆకట్టుకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెలానియా పాఠశాల సందర్శనను పురస్కరించుకొని ‘మీరు ఈ పాఠశాలకు రావడాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఢిల్లీ ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

*చిత్రాలు.. న్యూఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను మంగళవారం సందర్శించిన అమెరికా ప్రథమ మహిళ మిలానియా ట్రంప్. స్వాగతం పలుకుతున్న ఓ బాలిక
*అనంతరం ఆమె విద్యార్థుల యోగా విన్యాసాలను కూడా ఆసక్తిగా తిలకించారు