జాతీయ వార్తలు

ఢిల్లీ అల్లర్లపై అమిత్ షా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో మంగళవారం ఉన్నతాధికార సమావేశం జరిగింది. నగరంలో హింసను అదుపు చేయడానికి వదంతుల వ్యాప్తిని కట్టడి చేయాలని, అలాగే పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంపొందాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ కీలక భేటీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలని, అన్ని ప్రాంతాల్లోనూ శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ముఖ్యంగా వదంతుల వ్యాప్తిని కఠినంగా నిరోధించే చర్యలు చేపట్టాలని ఈ సమావేశం గట్టిగా విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

*చిత్రం...ఈశాన్య ఢిల్లీలో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్