జాతీయ వార్తలు

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నగారా మోగింది. మహారాష్టల్రోనే కాకుండా జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో రాజకీయాల చక్రం తిప్పే సీనియర్ మరాఠా నాయకుడు శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కేవీపీ రామచందర్ రావు, కే కేశవరావు, టీ సుబ్బరామి రెడ్డి, ఎంఏ ఖాన్ తదితర ముఖ్యులు రిటైర్ అవుతున్నారు. వీరిలో ఎంత మంది మళ్లీ ఎన్నికవుతారు, ఎంత మంది సభకు దూరమవుతారనేది వేచి చూడాల్సి ఉంది.
17 రాష్ట్రాలకు చెందిన 55 స్థానాలకు మార్చ్ 26 తేదీ ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పెద్దల సభ ఖాళీలు భర్తీ చేసేందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను మార్చి 6న జారీ చేస్తారు. రాజ్యసభకు పోటీ చేసే వారు తమ నామిషన్ పత్రాలను మార్చి 13లోగా దాఖలు చేసుకోవలసి ఉంటుంది. నామినేషన్ పత్రాలను మార్చి 16న పరిశీలిస్తారు. ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే మార్చి 18 లోగా తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. రాజ్యసభకు చెందిన 55 మంది సభ్యులు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేస్తున్నందున ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్ర నుండి అత్యధిక మంది ఏడుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. శరద్‌చంద్ర గోవింద్‌రావ్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ బందు అథావలేతో పాటు మరో ఐదుగురు. ఒడిషా నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు, ఆంధ్ర ప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ముగ్గురు, బిహార్ నుంచి ఐదుగురు, చత్తీస్‌గడ్ నుండి ఇద్దరు, గుజరాత్ నుంచి నలుగురు, హర్యానా నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కరు, జార్కండ్ నుంచి ఇద్దరు,
మధ్య ప్రదేశ్ నుంచి ముగ్గురు, మణిపూర్ నుంచి ఒక్కరు, రాజస్తాన్ నుంచి ముగ్గురు, మేఘాలయ నుంచి ఒక్కరు ఏప్రిల్‌లో రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మహమ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బరామి రెడ్డి, తోట సీతారామ లక్ష్మి, కే కేశవరావు, తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్‌రావు రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువేశ్వర్ కలిత అస్సాం, మోతీలాల్ ఓరా చత్తీస్‌గడ్ నుంచి రిటైర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ రాజస్తాన్ నుంచి రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్న ముగ్గురు సీనియర్ నాయకులు ఎంఏ ఖాన్, రామచందర్ రావు, సుబ్బరామి రెడ్డి మళ్లీ తెలుగు రాష్ట్రాల నుండి గెలిచే అవకాశాలు లేవనేది అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగై పోగా తెలంగాణలో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నించాల్సి వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులుంటే మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 88 మంది సభ్యులున్న టీఆర్‌ఎస్ రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న రెండు సీట్లను సునాయసంగా గెలుచుకుంటుంది. అయితే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావును రెండోసారి రాజ్యసభకు పంపిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ గెలుచుకుంటుంది.