జాతీయ వార్తలు

మా దేశంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని భారతీయ పారిశ్రామికవేత్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇందుకు వీలుగా అన్నిరకాలుగానూ నియమనిబంధనలను సడలిస్తామని మంగళవారంనాడు ఇక్కడ జరిగిన సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రకటించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసుకోవడానికి విస్తృతంగా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగ ళం బిర్లా తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అమెరికాలో పెట్టుబడులకు వీలుగా అన్ని రకాలుగానూ నియమ నిబంధనలను సడలిస్తామని, ఇందుకు వీలుగా సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత పారిశ్రామికవేత్తలు దేశంలోని తమ వ్యాపారాలు, పెట్టుబడుల గురించి అమెరికా అధ్యక్షుడికి వివరించారు. ‘మీరు సాధించిన విజయానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. అమెరికా వచ్చి అక్కడ కూడా పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నాను. ఈ పెట్టుబడులు అన్నది కేవలం డబ్బు కాదు, వాటి ద్వారా ఉపాధి కల్పనే’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటే, వ్యాపారాలు చేయాలంటే పాలనాపరంగా, చట్టపరంగా ఎన్నో అవరోధాలు ఉన్నాయని భారత పారిశ్రామికవేత్తలు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లినపుడు ‘అయితే ఇందుకు సం బంధించిన కొన్ని నిబంధనలు చట్టపరమైన ప్రక్రియలో భాగం. అయి తే మా వంతుగా వీటిని మరింతగా తగ్గిస్తాం. మీరు పెట్టుబడులు పెడి తే మీకు అన్నివిధాలుగా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి’ అని వివరించారు. భారత్-అమెరికాలోని పరిశ్రమలు పరస్పరం పెట్టుబడులు పెట్టుకోవాలని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఉపాధి కల్పనకు దోహదం చేయడానికే ప్రయత్నిస్తాయని వాస్తవంగా ఉద్యోగాలు అందించాల్సింది ప్రైవేటు పరిశ్రమలేనని ట్రం ప్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి దీర్ఘకాలంగా పనిచేస్తున్నానని పేర్కొన్న ఆయన ‘మేము ఇక్కడ ఉద్యోగాలు సృష్టిస్తున్నా ము. మీ ద్వారా మోదీ అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారు’ అని ట్రంప్ అన్నారు. మోదీ మంచివాడే కాదు, గట్టివాడు కూడా అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఆయన చేస్తున్న పని అద్భుతమని తెలిపారు. భారత్ పర్యటనకు రావడం తనకెంతో ఆనందంగా, గౌరవంగా ఉందన్నారు. మూడు బిలియన్ డాలర్ల వ్య యంతో కూడుకున్న హెలికాప్టర్లను భారత్‌కు విక్రయిస్తున్నామని తెలిపారు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించబోతున్నానని, దానివల్ల మార్కెట్లు మరింత శక్తిని పుంజుకుంటాయని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, హెల్త్‌కేర్, సైన్యానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని అన్నారు. తన సారథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంతగా శక్తివంతం అవుతోందని తెలిపారు.
*చిత్రం... ఢిల్లీలో అమెరికా ఎంబసీలో మంగళవారం జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్