జాతీయ వార్తలు

భద్రతా వైఫల్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: షహీన్‌బాగ్ సంఘటన ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని ఎన్‌సీపీ పార్లమెంటు సభ్యురాలు సుప్రియ సూలే ధ్వజమెత్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసమర్థత వల్లే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నదని ఆమె విమర్శించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన ఎన్‌సీఏ వ్యతిరేక ప్రదర్శనలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 20 మంది మృతి చెందారని ఆమె అన్నారు. అన్ని రకాలుగా విఫలమైన అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. షహీన్‌బాగ్ సహా ఢిల్లీ అల్లర్లపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలోనే ఇంతటి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం దురదృష్టకరమని సుప్రియ వ్యాఖ్యానించారు. నిష్పాక్షిక విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు.