క్రైమ్/లీగల్

బాంబే హైకోర్టు సీజేగా ధర్మాధికారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీపీ ధర్మాధికారి పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం బాంబే హైకోర్టులోనే తాత్కాలిక సీజేగా ఉన్నారు. ఆయనను పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే అధ్యక్షతన ఈనెల 24న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మాధికారి మంగళవారమే బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ భూషణ్ ప్రద్యుమ్న ధర్మాధికారి 1958 ఏప్రిల్ 28న జన్మించారు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇప్పుడా యూనివర్సిటీని రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ వర్సిటీగా పిలుస్తున్నారు. మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న ధర్మాధికారి 1980 నుంచి నాగ్‌పూర్‌లోనే న్యాయవాది వృత్తిని కొనసాగించారు. 2004 మార్చి 15న అడిషనల్ జడ్జిగా నియమితులైన ఆయన 2006 మార్చి 12న పదోన్నతి పొంది శాశ్వత న్యాయవాదిగా నియమితులయ్యారు. వివిధ న్యాయస్థానాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే సారథ్యంలోని కొలీజియంలో న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్, భానుమతి సభ్యులుగా ఉన్నారు.