జాతీయ వార్తలు

సిక్కుల ఊచకోత మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సోనియా గాంధీ బురద రాజకీయం చేస్తున్నారంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. సోనియా గాంధీ ఎన్డీఏపై విమర్శలు చేసిన కొన్ని నిమిషాలకే ఇరువురు కేంద్ర మంత్రులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోనియా గాంధీపై విరుచుకు పడ్డారు. అల్లర్ల నేపథ్యంలో అందరు సంయమనంతో వ్యవహరించాల్సిన సమయంలో సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన వారు తమకు నీతి నేర్పించడం ఏమిటని వారు ప్రశ్నించారు. సోనియా గాంధీ ఈశాన్య ఢిల్లీ అల్లర్లను
రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటని వారు విమర్శించారు. అల్లర్లను రాజకీయం చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. బీజేపీ మూలంగానే అల్లర్లు జరిగాయని సోనియా గాంధీ విమర్శించడం దురదృష్టకరం, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో అందరు కూడా ఢిల్లీ ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని వారు సూచించారు.