జాతీయ వార్తలు

నరేంద్ర మోదీ శాంతి పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి, సోదరభావం నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోదీ బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ఢిల్లీలో గత మూడు రోజులు జరిగిన అల్లర్లపై నరేంద్ర మోదీ మొదటిసారి స్పందిస్తూ శాంతి, సామరస్యం మన సంస్కృతి మూల స్తంభాలంటూ అన్ని వేళలా శాంతి, సోదరభావం నెలకొల్పాలని ఢిల్లీలోని సోదర, సోదరీమణులకు విజప్తి చేస్తున్నానని తెలిపారు. ఢిల్లీలో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని, ప్రశాంతత నెలకొనాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై పూర్తి స్థాయి సమీక్ష జరిపామని, శాంతిని నెలకొల్పి, సామాన్య పరిస్థితులను పునరుద్ధరించేందుకు పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని ప్రధాని మోదీ వివరించారు. ఈశాన్న ఢిల్లీలో 3రోజుల్లో మొత్తం 21 మంది మరణించగా దాదాపు రెండు వందల మంది గాయపడడం తెలిసిందే.