జాతీయ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పది లక్షల రూపాయిల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. అలాగే, హింసాకాండలో గాయపడిన వారికి అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయిల సహాయాన్ని అందిస్తామని గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
అల్లర్ల కారణంగా కీలకమైన పత్రాలను కోల్పోయిన ప్రజలకు తిరిగి వాటిని అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. అల్లర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందన్న ఆరోపణలపై స్పందించిన ఆయన.. ‘ఈ రకమైన దారుణాలకు పాల్పడే వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడైనా క్షమించేది లేదు.. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు ఇందుకు పాల్పడినట్లు రుజువైతే వారికి విధించే శిక్ష రెండింతలు ఉంటుంది’ అని తెలిపారు.
*చిత్రం... ఈశాన్య ఢిల్లీలోని ఖాజూరి ఖాస్ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్న మహిళా సంఘం కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్