జాతీయ వార్తలు

సంతోషం ఆవిరైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశ రాజధాని ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 34 మంది ప్రాణాలను బలితీసుకున్న సీఏఏ ఉద్యమం బంగారు భవిత మసకబారేలా చేసింది. ‘వెల్‌కమ్ టు ఏ వెరీ హ్యాపీ స్కూల్’ అన్న సగం బోర్డు విధ్వంస తీవ్రతకు సాక్షీభూతంగా నిలిచింది. హ్యాపీ అన్నది ఆవిరైపోయింది. ఈశాన్య ఢిల్లీలోని బ్రిజ్‌పురిలోని ఓ ప్రైవేటు పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. పిల్లల కేరింతలు, సంతోషంతో కలకలలాడిన పాఠశాలలో ఇప్పుడు ప్రేతకళ ఆవహించింది. విధ్వంసంలో విరిగిపోయిన బల్లలు, డెస్క్‌లు, బూడిదగా మిగిలిన పుస్తకాలు కనిపిస్తున్నాయి. బ్రిజ్‌పూరిలో 32 ఏళ్లుగా అరుణ్ మోడల్ స్కూల్ నడుస్తోంది. సీఏఏ ఉద్యమకారుల విధ్వసంతో పాఠశాల ఇప్పుడో స్మశానాన్ని తలపిస్తోంది. నష్టం 70 లక్షల రూపాయలు. అక్షరాలతో అలరారే సరస్వతి నిలయంలో ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని తాము ఎప్పుడూ ఊహించనేలేదని ప్రిన్సిపాల్ జ్యోతి రాణి ఆవేదనతో చెప్పారు. ‘పాఠశాలకు అపార ఆస్తి నష్టం జరిగినందుకు మాకు బాధ లేదు. అల్లరి మూకలు దాడికి తెగబడిన సమయంలో పిల్లలు ఎవరూ లేకపోవడం మాకు పెద్ద ఉపశమనం కలిగించింది. మాకు అది చాలు’అని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పాఠశాల సెక్యురిటీ గార్డు ఉండగానే అతడిని తోసుకుంటూ మూకలు లోపలకు దూసుకొచ్చారని ఆమె తెలిపారు. భయంతో గార్డు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడని ప్రిన్సిపాల్ అన్నారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో రెండు రోజుల తరువాత తాము పాఠశాలకు వెళ్లామని ఆమె చెప్పారు. ఆ సమయంలో పాఠశాలలో జరిగిన విధ్వంసకాండను చూసి గుండె ఆగినంత పనైందని జ్యోతి రాణి ఆందోళన వ్యక్తం చేశారు. ‘పాఠశాలలోపల స్మశానంలా కనిపించింది. చిన్నారులు కూర్చునే బల్లలు నామరూపాల్లేకుండా పోయాయి. అల్లరి మూకలు డెస్క్‌లను తగలబెట్టాయి. పుస్తకాలు బూడిదగా మారాయి. లైబ్రరీ, మెస్సు దేన్నీ విధ్వంసకారులు వదలిపెట్టలేదు‘అని పాఠశాల కరస్పాడెంట్ బిశ్వం శర్మ వాపోయారు. 1987 నుంచి పాఠశాల నడుస్తోందన్న ఆయన రూ. 70 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదనకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అరుణ్ మోడల్ స్కూల్‌పై దాడి జరిగింది. పాఠశాలలో విలువైన ఫర్నీచర్‌తోపాటు 30 ఏళ్లనాటి రికార్డులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ పిల్లలెవరూ ఆ సమయంలో స్కూల్‌లో లేరు. అదే తమకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చిందని ప్రిన్సిపాల్ జ్యోతి రాణి అన్నారు. తాము ఏం తప్పుచేశామని నిరసనకారులలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు? వార్షిక పరీక్షలకు సిద్ధంగా ఉన్న తమకు ఈ ఘటన అత్యంత విషాదాన్ని కలిగించిందని ఏడో తరగతి విద్యార్థి షాహీన్ అన్నాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేసే అధికారం వాళ్లకెవరిచారు?అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క అరుణ్ మోడల్ స్కూలే కాదు, శివవిహార్‌లోని రాజధాని స్కూలు, డీపీఆర్ స్కూలులోనూ విధ్వంసకాండ కొనసాగింది. ఢిల్లీలోని అల్లర్ల నేపథ్యం లో సీబీఎస్‌సీ పరీక్షలను బోర్డు వాయిదా వేయాల్సి వచ్చింది.

*చిత్రం...ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో ధ్వంసమైన తమ ఆస్తుల వద్ద ఓ మహిళ