జాతీయ వార్తలు

రోడ్ల దిగ్బంధనంపై చట్టాల ప్రతిపాదన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఆందోళనలు, నిరసనలు జరిగే సమయాల్లో కొంతమంది రోడ్లను దిగ్బంధనం చేయడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చట్టాల ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. షహీన్‌బాగ్ తరహా నిరసనలు వెల్లువెత్తినపుడు రోడ్లను దిగ్బంధనం చేయడం సహజమే. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే ఏవైనా చట్టాలను తీసుకువచ్చే ప్రతిపాదనలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయితే, భవిష్యత్తులో ఈ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన ప్రకటించారు.