జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో శిబూ సొరేన్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 11: జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల సొరేన్ జార్ఖండ్ సచివాలయంకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెంట ఉన్నారు. మంత్రులు రామేశ్వర్ ఓరాన్, అలంగీర్ అలాం, ఇరుపార్టీల ఎమ్మెల్యేలు సచివాలయానికి తరలివచ్చారు. జార్ఘండ్ నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. పరిమళ్ నత్వానీ(ఇండిపెండెంట్), ప్రేమ్ చంద్ గుప్తా(ఆర్‌జేడీ) ఎంపీల గడువుఏప్రిల్ 9తో ముగుస్తోంది. శిబూ సొరైన్ రాజ్యసభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. గతంలో కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా ఆయన పనిచేశారు. అందరికీ గురూజీగా సుపరిచితుడైన సొరేన్ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దుమ్కా నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేఎంఎ-కాంగ్రెస్-ఆర్‌జేడీ కూటమి గతవారం సమావేశమై రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకూ తన అభ్యర్థిని ప్రకటించలేదు.

*చిత్రం... జార్ఖండ్‌లో శిబూ సొరేన్ నామినేషన్