జాతీయ వార్తలు

రాజ్యసభకు పవార్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 11: ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ముంబయి విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. పవర్ వెంట ఎన్‌సీపీ నేతలు ఉన్నారు. ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి ఫజియాఖాన్ కూడా శరద్ పవార్‌తో పాటు నామినేషన్ దాఖలు చేస్తారని భావించారు. అయితే గురువారం ఖాన్ నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 26న రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈనెల 13న ఆఖరు తేది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రి రామ్‌దాస్ అథావలే, కాంగ్రెస్ నేత హుస్సేన్ దాల్వాయ్, శివసేన నేత రాజకుమార్ దూత్, బీజేపీ నేత అమర్ సబ్లే, ఇండిపెండెంట్ సంజయ్ కకాడే, ఎన్‌సీపీ నేత మజీద్ మీనన్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో అభ్యర్థికి 37 ఓట్లు కావాలి. ఇలా ఉండగా రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సంకీర్ణ ప్రభుత్వం భేటీ అయింది.
*చిత్రం... రాజ్యసభకు నామినేషన్ వేయడానికి ముంబయిలోని విధాన్ భవన్‌కు బుధవారం తమ పార్టీ నేతలతో
కలసి వెళ్తున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్