జాతీయ వార్తలు

మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిషికేష్, మార్చి 14: వైద్య విద్యార్థులు మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తిచేసుకుని వృత్తిలోకి అడుగుపెట్టే యువత ప్రజలకు ముఖ్యమంగా మారుమూల ప్రాంతాల వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఎయిమ్స్ రెండో స్నాతకోత్సవాల్లో షా పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏడాది ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే మందులు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రధాన మోదీ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. రిషికేష్ ఎయిమ్స్ నుంచి డిగ్రీలు తీసుకున్న 248 మంది విద్యార్థులను అమిత్ షా అభినందించారు. ‘మీరు సంపాదించిన జ్ఞానం ప్రజలకు ఉపయోగపడాలి. మారుమూల ప్రజలకు చక్కని వైద్య సేవలు అందించాలి’అని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని ఆయన చెప్పారు. దేశంలో వైద్య రంగానికి సంబంధించి వౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని మోదీ అనేక చర్యలు చేపట్టారని అమిత్ షా తెలిపారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలు ప్రారంభించారని అన్నారు. దీని వల్ల అదనంగా 29,000 ఎంబీబీఎస్, 17వేల పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని హోం మంత్రి వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ కొత్తగా పట్ట్భద్రులైన వారు అంకిత భావంతో పనిచేసిన వైద్య వృత్తికి వనె్న తేవాలని పిలుపునిచ్చారు.
*చిత్రం... రిషికేష్‌లోని ఎయిమ్స్ స్నాతకోత్సవం సందర్భంగా శనివారం ఓ విద్యార్థినికి సర్ట్ఫికెట్ అందజేస్తున్న
కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్, కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్