జాతీయ వార్తలు

బెంగళూరులో అప్రకటిత కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 14: కరోనా వైరస్ ప్రభావం ఐటీ హబ్ బెంగళూరుపై తీవ్రంగా పడింది. ఐటీ నగరంలో కర్ఫ్యూ వాతావరణ కనిపించింది. శనివారం నాడు బెంగళూరులో జనం సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయింది.
నిత్యం కిటకిటలాడే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వెలవెల బోయాయి. మాల్స్, సినిమా హాళ్లు, పబ్‌లు, నైట్ క్లబ్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోనే తొలి కరోనా మరణం కర్నాటకలోనే సంభవించడంతో రాష్ట్రం మొత్తం అలర్ట్ అయింది. కలబుర్గిలో 76 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మృతి చెందాడు. మర్నాడే అంటే శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. వారంపాటు వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. నిత్యం జనసమర్ధంగా ఉండే బెంగళూరు సెంట్రల్ బస్‌స్టేషన్ నిర్మానుష్యంగా మారింది.
రెండు రోజుల ప్రయాణికుల జాడేలేదని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ అధికారి వెల్లడించారు. కర్నాటక రోడ్డు రవాణా సంస్థ ఇంటర్ సిటీ, ఇంటర్ స్టేట్ సర్వీసులు నడుపుతున్నా బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబడి ఘోరంగా పడిపోయింది. రోజుకు ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని, నాలుగైదు రోజులుగా రోజుకు 32 లక్షల రూపాయలు రావడమే గగనమైపోయిందని బెంగళూరు డివిజనల్ కంట్రోలర్ బీటీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంప్‌లు, కాన్ఫరెన్స్‌లు, ప్రదర్శనలు, వివాహాలు, క్రీడోత్సవాలు, పెండ్లి చూపులు, బర్త్‌డే పార్టీలు వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోడం చేయాలని సీఎం యడియూరప్ప శుక్రవారం స్పష్టం చేశారు. కోవిడ్-19 ప్రభావం హోటల్, పబ్ వ్యాపారాలపై తీవ్రంగా ఉంది. ‘మా వ్యాపారాలు 40 నుంచి 70 శాతానికి పడిపోయాయి. ఎప్పటికి కోలుకుంటామో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూలేదు’అని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరు చాప్టర్ చీఫ్ మను చంద్ర అన్నారు. చిత్రదుర్గ జిల్లాలో వార్షిక రథయాత్ర రద్దయింది. బెంగళూరులోని ఓ ఆలయం వద్ద అయితే కరోనా వైరస్ ప్రభావం వల్ల తీర్థ ప్రసాదాలు అందజేయలేకపోతున్నామని బోర్డు పెట్టారు. భక్తులు సహకరించాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

*చిత్రం... విధాన సౌధ