జాతీయ వార్తలు

ముంబయి తీరంలో తప్పిన పెను విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: ముంబయి తీరంలో శనివారం ఒక పెను విషాదం తప్పిపోయింది. ముంబయికి సమీపంలోని మాండ్వా తీరంలో సముద్రంలో 88 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక నౌక ఒక ‘రాళ్ల ప్యాచ్’ను ఢీకొని బోల్తాపడింది. దీంతో నౌకలోకి నీరు చేరడం మొదలయింది. ఫలితంగా నౌక మునగడం కూడా మొదలయింది. మహిళలు, పిల్లలు సహా నౌకలో ఉన్న ప్రయాణికులు అరవడం మొదలు పెట్టారు. నౌకలో ఉన్న సిబ్బంది తమను కాపాడాలంటూ అధికారులను కోరారు. అధికారులు మెరైన్ పోలీస్‌ను, ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. దీంతో ఒక పోలీస్ పెట్రోల్ నౌక ప్రయాణికులు ఉన్న నౌక దగ్గరికి చేరుకొంది. ప్రయాణికుల నౌకలోని సిబ్బంది సహాయంతో మెరైన్ పోలీసులు ఆ నౌకలో ఉన్న ప్రయాణికులందరిని తమ నౌకలోకి తరలించారు. మెరైన్ పోలీసుల నౌకలోకి 80 మందిని, మరో ప్రైవేట్ నౌకలోకి మిగిలిన ఎనిమిది మందిని తరలించారు. అనంతరం వారందరిని మాండ్వా తీరంలోకి తీసుకొచ్చారు.
*చిత్రం... అరేబియా సముద్రంలోని మాధ్వాతీరం సమీపంలో నేలను ఢీకొని బోల్తాపడిన ప్రయాణికుల నౌక అజంతా