జాతీయ వార్తలు

కరోనా కట్టడికి చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకునేందుకు కేంద్రం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ జాతికి వివరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ కూడా కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్‌లో ఇంత మంది దేవుళ్లు, దేవతలు ఉండగా కరోనా దేశ ప్రజలకు ఎలాంటి హానీ చేయదని బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా చేసిన వ్యాఖ్యలను మాకెన్ ఎద్దేవా చేశారు. ఎవరి విశ్వాసాలు, నమ్మకాలు వారికుంటాయన్న మాకెన్ ‘ ప్రజల ప్రాణాలను కాపాడం, వారికి రక్షణ కల్పించడం, మహమ్మారి కరోనా రాకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెబితే బావుంటుంది’అని అన్నారు. తమ కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదన్న ప్రశ్న ప్రజలను వేధిస్తోందని అజయ్ మాకెన్ చెప్పారు.‘ మా నాయకుడు రాహుల్‌జీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదీ కనిపించడంలేదు అని పదేపదే అడుగుతున్నారు’ అని మాకెన్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే దేవుళ్లు, దేవతలు తమ వంతు సహకారం అందిస్తాయి, అంతే తప్ప గాలిలో దీపం పెట్టి ఆదుకోమంటి ఎవరూ ముందుకురారు అని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను అదుపుచేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరి ట్వీట్ చేస్తూ ‘కోవిడ్-19 అదుపునకు కేంద్రం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రధాని మోదీ జాతికి వెల్లడించాలి’అని డిమాండ్ చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాట్లను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా దేశ వ్యాప్తంగా 84 కరోనా కేసులు నమోదు కాగా, శనివారం నాటికి ఇద్దరు మృతి చెందారు.

*చిత్రం... కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి