జాతీయ వార్తలు

అయోధ్యలో ఇక ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, మార్చి 14: అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్, అతని నలుగురు అనుచరులు మాత్రమే ప్రతిరోజు ఇక్కడ రాముడికి పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనడానికి అనుమతించడం లేదు. అయితే, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు వివాదాస్పద స్థలాన్ని ఒక ట్రస్టుకు అప్పగించడానికి మార్గం సుగమం చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రాముడి పుట్టిన రోజుగా భావించే శ్రీరామనవమి ఈ సంవత్సరం వస్తోంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ రెండో తేదీన నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, స్థానిక పాలనాయంత్రాంగం మాత్రం ఈ ఉత్సవాలను కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది. ట్రస్టు శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రజలు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.