జాతీయ వార్తలు

కరోనా నియంత్రణకు సలహాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సాంకేతిక పరిజానంతో కూడిన పరిష్కారాలను సూచించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు తమ సాంకేతిక పరిజానంతో కూడిన పరిష్కారాలను ‘మై గవర్నమెంట్ ఇండియా’లో పొందుపరచాలని సూచిస్తూ ప్రధాని మోదీ సోమవారం ట్వీట్ చేశారు. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం ఆవిష్కారాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని మోదీ అభిప్రాయపడ్డారు. చాలా మంది ప్రజలు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు సాంకేతిక పరిజానంతో కూడిన పరిష్కారాలను పంచుకుంటున్నారు, వీటిని ‘ఎట్ ది రేట్ మై గవ్‌ఇండియా’ ద్వారా పంచుకోవాలని వీరందరికి విజప్తి చేస్తున్నాను, మీరిలా చేయడం వలన ఎంతో మందికి మేలు చేసిన వారవుతారు’ అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో తెలిపారు.