జాతీయ వార్తలు

నా హక్కును స్పీకర్ హరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: ‘లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నా హక్కును హరించారు, అనుబంధ ప్రశ్న వేయడానికి వీల్లేదన్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారించిన తీరు పట్ల తనకు ఎంతో బాధ కలిగిందని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకు రుణాల ఎగవేతదారుల పేర్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బయట పెట్టకపోవడం గురించి తాను ప్రశ్నించానని ఆయన తెలిపారు.
అయితే ఆ ప్రశ్నకు అనుబంధంగా మరో ప్రశ్న వేయాలనుకుంటే అందుకు స్పీకర్ బిర్లా అనుమతించలేదన్నారు. ఒక ప్రశ్నకు సరైన సమాధానం రానప్పుడు అనుబంధ ప్రశ్న వేసేందుకు లోక్‌సభ సభ్యునిగా తనకు హక్కు ఉందని ఆయన తెలిపారు. అనుబంధ ప్రశ్న వేయరాదని మరో రూపంలో ప్రశ్న వేసుకోవాలని స్పీకర్ సలహా ఇచ్చారని ఆయన చెప్పారు.
తన పట్ల స్పీకర్ వ్యవహారించిన తీరు బాగా లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యునికీ ప్రశ్న తర్వాత అనుబంధ ప్రశ్న వేసే హక్కు ఉంటుందని, లోక్‌సభ ప్రొసీడీంగ్స్‌లో నియమం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల గురించి తాను ప్రశ్నించినప్పుడు సంబంధిత కేంద్ర మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన తెలిపారు. దీంతో తాను ఆ ప్రశ్నకు అనుబంధంగా మరో ప్రశ్న వేసేందుకు ఉద్యుక్తుడినయ్యానని, కానీ స్పీకర్ బిర్లా అందుకు ససేమిరా అన్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
రుణ ఎగవేతదారుల పేర్లు వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన 500 మంది పేర్లను బయట పెట్టడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందని లోగడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అటువంటప్పుడు రుణ ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల జాబితాలో 50 మంది ప్రముఖులు ఉన్నారని రాహుల్ విమర్శించారు.
*చిత్రం... కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ