జాతీయ వార్తలు

రంజన్ గొగోయ్‌కి కానుకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, మార్చి 17: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయటం ద్వారా రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి చేసింది, న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని దెబ్బ తీసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌మను సింఘ్వి ఆరోపించారు. అభిషేక్‌మను సింఘ్వి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగంపై చేసిన దాడిని క్షమించలేమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి(రంజన్ గొగోయ్) గురించి తాము మాట్లాడడం లేదని, ఒక సిద్దాంతం, నీతి, నియమం గురించి మాట్లాడుతున్నామన్నారు. రాజ్యాంగం లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థ అధికారాలను స్పష్టంగా విభజించింది, ఎవరి అధికారాలు వారికి ఉన్నాయి, అయితే బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయటం ద్వారా న్యాయ వ్యవస్థను లెజిస్లేచర్‌కు లొంగి ఉండేలా చేసిందని సింఘ్వి దుయ్యబట్టారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బ తీశారని సింఘ్వి ఆరోపించారు. ప్రభుత్వం తన చర్య ద్వారా న్యాయ వ్యవస్థ మూలాలను పెకిలించివేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ గతంలో రంగనాథ మిశ్రాను రాజ్యసభకు నామినేట్ చేయలేదా అని బి.జె.పి ప్రశ్నిస్తోంది, అయితే మిశ్రా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత ఆరు సంవత్సరాలకు రాజ్యసభకు నామినేట్ చేసిందనేది మరిచిపోరాదని సింఘ్వి సూచించారు. రంజన్ గొగోయ్ పదవీ విరమణ చెందిన తరువాత ఐదు నేలలకే రాజ్యసభకు నామినేట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆయన వాదించారు. మాజీ న్యాయమూర్తి హితాయతుల్లాను రాజ్యసభకు ఎంపిక చేయలేదు, ఆయన నేరుగా ఉపరాష్టప్రతి అయ్యారు, ఉప రాష్టప్రతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్ అయ్యారని సింఘ్వి వివరించారు. హిదాయతుల్లా పదవీ విరమణ చెందిన తరువాత తొమ్మిది సంవత్సరాలకు ఉప రాష్టప్రతి అయ్యారని ఆయన తెలిపారు. బహరూల్ ఇస్లాం కూడా మొదట రాజ్యసభకు ఎన్నికైన తరువాత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారని సింఘ్వి చెప్పారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చెందే ముందు ఇచ్చే తీర్పులపై పదవీ విరమణ చేసిన తరువాత ఆశించే పదవుల ప్రభావం ఉంటుందంటూ మాజీ మంత్రి అరుణ్‌జేట్లి చెప్పిన మాటలను సింఘ్వి ఊటంకించారు. మాజీ న్యాయమూర్తులకు పదవీ విరమణ చెందిన రెండు సంవత్సరాల తరువాతనే ఇతర పదవుల్లో నియమించాలనే సంప్రదాయాన్ని బీజేపీ ఎందుకు పాటించలేదని ఆయన నిలదీశారు.