జాతీయ వార్తలు

రాజుకుంటున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి శ్రీరామునికి చెందినదేనని తీర్పునిచ్చి సంచలనం సృష్టించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ నామినేషన్ అత్యంత వివాదాస్పదమైంది. అయోధ్య భూమిని హిందువులకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చినందుకే రంజన్ గొగోయ్‌ను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిందని మాజీ న్యాయమూర్తి ఏపీ షా, కురియన్ జోసెఫ్ ఆరోపిస్తే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి రిటైర్ అయిన ఐదు నెలలకే రాజ్యసభ సీటును ఎందుకు కేటాయించారనేది సభ్యత్వ ప్రమాణం చేసిన తరువాత చెబుతానని రంజన్ గొగోయ్ అంటున్నారు.
ఇది ‘క్విడ్ ప్రోకో’ వ్యవహారమంటూ మాజీ న్యాయమూర్తి షా మాత్రం గొగోయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం సిఫారసు మేరకే రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు రాష్టప్రతి నామినేట్ చేశారనేది అందరికి తెలిసిందే. వివాదాస్పద అయోధ్య-బాబ్రీ మసీదు భూమిని శ్రీరాముడికి కేటాయించటం, బీజేపీకి వచ్చిన కోట్లాది రూపాయల డొనేషన్లకు సంబంధించిన కేసును రంజన్ గొగోయ్ తొక్కిపెట్టారనీ, అందకే ఆయనను ఎన్.డి.ఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ న్యాయమూర్తి షా మాత్రం రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు కురిపించారు. వివాదాస్పద అయోధ్య కేసులో ప్రభుత్వం సూచన మేరకు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నది రంజన్ గొగోయ్‌పై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఆయోధ్యలోని వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించినందుకు ప్రతిగా ఇప్పుడు రాజ్యసభ సీటు లభించిందని ఆయన చెబుతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి రిటైర్ అయిన ఐదు నెలలకే రాజ్యసభ సీటును ఎలా ఆమోదిస్తారన్నది న్యాయమూర్తి షా ప్రశ్న. రంజన్‌గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయటం ద్వారా ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు ఒక స్పష్టమైన సందేశం పంపించింది, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తే పదవులు లభిస్తాయి లేకపోతే ప్రాధాన్యత లేని ప్రాంతాలకు బదిలీలు తప్పవన్నది ప్రభుత్వం సందేశమని న్యాయమూర్తి షా తెలిపారు.
రంజన్ గొగోయ్ రాజ్యసభ నామినేషన్‌ను ఆమోదించటం ద్వారా న్యాయవ్యవస్థను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో న్యాయవ్యవస్థ ప్రయోజనాలు కాపాడుతానంటూ రంజన్ గొగోయ్ చేసిన ప్రకటన గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం అంటే ప్రభుత్వానికి లొంగిపోయినట్లే కదా, ఈ నేపథ్యంలో ఆయన న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను ఎలా కాపాడుతారు? న్యాయ వ్యవస్థను కాపాడాలంటే బయటి నుంచి పోరాడాలి తప్ప ప్రభుత్వంతో కలిసిపోరాదని న్యాయమూర్తి షా స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు కొంత కాలం పాటు పదవులకు దూరంగా ఉండాలని మొదట వాదించిన రంజన్ గొగోయ్ ఇప్పుడు పదవికి లొంగిపోయారని విశ్రాంత న్యాయమూర్తి షా ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కూడా రిటైర్డ్ న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రాను రాజ్యసభకు నామినేట్ చేశారు కదా అని ఒక విలేకరి సూచించగా వారు తప్పు చేస్తే వీరు కూడా తప్పు చేయాలా? అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు కొన్ని సంవత్సరాల పాటైనా పదవులకు దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని సమర్థించిన రంజన్ గొగోయ్ తాను రిటైర్ అయిన ఐదు నెలలకే రాజ్యసభ సభ్యత్వాన్ని ఎలా ఆమోదించారని మాజీ న్యాయమూర్తి షా ప్రశ్నించారు.
సభ్యత్వ ప్రమాణం తరువాత చెబుతా
రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందనేది సభ్యత్వ ప్రమాణం చేసిన తరువాత వెల్లడిస్తానని రంజన్ గొగోయ్ చెప్పారు. పార్లమెంటులో న్యాయ వ్యవస్థ అభిప్రాయాలను తెలియజేయగలుగుతానని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సభ్యత్వ ప్రమాణం చేస్తాను, రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు ఆమోదించాననేది ఆ తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని రంజన్ గొగోయ్ మంగళవారం గౌహతిలో విలేకరులతో చెప్పారు. జాతి నిర్మాణం కోసం లెజిస్లేటివ్, న్యాయ వ్యవస్థ కలిసి పని చేయాలన్నది తమ ప్రగాఢ విశ్వాసము, అందుకే రాజ్యసభ నామినేషన్‌ను ఆమోదించానన్నారు.