జాతీయ వార్తలు

కరోనాతో ఆర్థిక వ్యవస్థ కకావికలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సునామి లాంటిది, ఇది మన ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయబోతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా ముంచుకుని వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరొనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి దేశంలోని కోట్లాది మందిని ఆర్థిక ఇబ్బందుల్లో పడవేస్తుందనే భయాందోళనను ఆయన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ వెనక వస్తున్న ఆర్థిక సునామిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కరోనా వైరస్ తెస్తున్న ఆర్థిక సునామిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వానికి తాను ప్రతి రోజు చెబుతున్నానని, అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముంచుకు వస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అర్థంపర్థం లేని మాటలతో రోజులు గడిపేస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. దేశాన్ని రాబోయే ఆర్థిక సంక్షోభం నుండి కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్నారు. కరోనా వైరస్ మూలంగా దేశంలో అతి పెద్ద ఆర్థిక సంక్షోభం నెలకొని కొట్లాది మందిని దెబ్బతీస్తుంది, ఇబ్బందుల్లో పడవేస్తుంది, ఎంతో బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తోందని రాహుల్ అన్నారు. రాబోయే ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రాహుల్ ఆరోపించారు. ముంచుకుని వస్తున్న ఆర్థిక సంక్షోబాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ తన వాదనకు మద్దతుగా ఒక కథ చెప్పారు. గతంలో సునామి వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ తీరంలో నీళ్లు కిందికి వెళ్లిపోగానే అందరు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు, అయితే ఆ వెంటనే సునామి రావటంతో అందరు ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు దేశంలో కూడా ఇదే జరుగబోతోందని రాహుల్ అన్నారు. అతి పెద్ద ఆర్థిక సునామి రాబోతోందని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఏం చేయాలనేది అర్థం కావడం లేదని రాహుల్ విమర్శించారు. దేశం కేవలం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమైతే సరిపోదు, కరోనా వెనక నుండి వస్తున్న ఆర్థిక సునామీని ఎదుర్కొనేందుకు సిద్దం కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఆరు నెలల్లో దేశ ప్రజలు ఊహించలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొబోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నా ఎవ్వరు పట్టించుకోవటం లేదని ఆయన వాపోయారు. నరేంద్ర మోదీ వెంటనే కళ్లు తెరిచి చుట్టుపక్కల ఏం జరుగబోతోంది? ఏ ప్రమాదం ముంచుకు వస్తోందనేది తెలుసుకోవాలన్నారు. ప్రధాని భయపడడం మానివేసి ముంచుకు వస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటం మంచిదని రాహుల్ గాంధీ హితవు చెప్పారు.

*చిత్రం...కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ