జాతీయ వార్తలు

కరోనాపై దక్షిణాది సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 18: కరోనా వైరస్ మహామ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. కరోనా వ్యాధిని ఎదుర్కొవడానికి అన్ని చర్యలు చేపట్టాయి. ప్రపంచ దేశాలను ఈ మహామ్మారి వణికిస్తున్నది. వివిధ దేశాల నుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాయి. ప్రత్యేక నిఘా పెట్టాయి. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను నెలాఖరు వరకు మూసి వేయాలని ఆదేశించాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. వైరస్ సోకకుండా ఉండేందుకు రక్షణ మాస్క్‌లు ధరించాలని, తరచూ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలని, చుట్టు పక్కల పరిశుభ్రత పాటించాలని తదితర సూచనలను ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఎక్కువగా గుమికూడవద్దని, అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయరాదని సూచించాయి. కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కేరళలోని సీపీఎం ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. పర్యాటకులతో ఎక్కువ ఆదాయం సమకూరే కేరళ ప్రభుత్వానికి ఈ మహామ్మారితో నష్టపోతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ఎవరూ రాకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పుణ్య క్షేత్రాలూ బంద్
దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీంతో ప్రముఖ ప్రార్థనా మందిరాలూ బోసిపోతున్నాయి. సీబీఎస్‌ఇ, ఐసీఎస్‌ఇ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు మూతపడ్డాయి. కర్నాటకలో కరోనా వ్యాధితో 76 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా వ్యాధి నివారణకు రూ. 200 కోట్లు విడుదల చేశారు. కర్నాటకలో బుధవారం మరో ఇద్దరకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 13కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ సారథ్యంలో కర్నాటక ప్రభుత్వం టాస్క్ ఫోర్సును నియమిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మేఘాలయలో..
ఇదిలాఉండగా మేఘాలయ ప్రనుత్వం పర్యాటకుల రాకను నిలిపి వేసింది. అన్ని పర్యాటక ప్రాంతాలను మూసి వేయించింది. ముఖ్యమంత్రి కొన్‌రాడ్ కే సంగ్మా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.