జాతీయ వార్తలు

ర్యాండం శ్యాంపుల్సే కొలమానం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: దేశ వ్యాప్తంగా కరోనాపై యుద్ధం సాగుతోంది. వైరస్‌ను మరింత విజృంభించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే పరీక్షల ప్రక్రియ మరింత పకడ్బంధీగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం దేశం లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి(ఐసీఎంఆర్) విధానం కింద 72 లేబొరెటరీల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ వారాంతానికి మరో 49 అత్యాధునిక ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో స్టేజ్-2లో ఉన్న వైరస్ జన సమూహాల్లోకి విస్తరించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ర్యాండం శ్యాంపుల్స్ సేకరించి వైరస్‌ను కట్టడి చేయడానికి కృషి జరుగుతోంది. అయితే వైరస్‌ను అదుపుచేయడానికి ఇదొక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వైరస్ ఎలా వ్యాపిస్తుందో చెప్పడానికి ర్యాండం శ్యాంపుల్స్ పరీక్షల వల్ల తెలియదని డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ అన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్‌కు గుర్తించడానికి ఆ పరీక్షలు ఒక్కటే సరిపోవని ఆయనో వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో వెల్లడించారు. ‘సమగ్రమైన వ్యూహంతో ముందుకెళ్లాలి. పరీక్షలు మరింత లోతుగా జరపాలి. తీవ్రమైన కేసులకు సంబంధించి శ్వాస సంబంధిత సమస్యలపైనా పరీక్షలు జరగాలి’అని ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ స్పష్టం చేశారు. ‘గతంలో భారత్ ప్రభుత్వానికి మేం లేఖ రాశాం. ప్రైవేటు లేబొరెటరీలను అందుబాటులోకి తేవాలని కోరాం. అందులో భాగంగానే 51 అక్రిడేటెడ్ ప్రవేట్ ల్యాబ్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఇది కొంతలో కొంత నయమే. అయినా అదనంగా మరిని ప్రయోగశాలలను వినియోగంలోకి తీసుకురావాలి’అని ఆమె అన్నారు. మరిన్ని పరీక్షలు జరగాలని ఆమె పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి విధానంలో 52 ప్రయోగశాలల్లో నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ శ్యాంపుల్స్ ఎక్కడ నుంచి సేకరించారో సదరు వ్యక్తికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం ఉండడం లేదు. వారు ఎక్కడ పర్యటించారు? ఏమిటి అన్నదానిపై స్పష్టం ఉండడం లేదు. శ్వాస, న్యుమోనియా, ఇన్‌ఫ్లుంజా వంటి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి శ్యాంపుల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఒక్కో ల్యాబ్‌లో 20 శ్యాంపుల్స్ చొప్పున పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1000 శ్యాంపుల్స్ పంపగా 500 నెగెటీవ్ వచ్చిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మిగతా ఫలితాలు కోసం వేచిచూస్తున్నట్టు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా 72 ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ చెప్పారు. ఈ వారంతానికి 49 ప్రభుత్వ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.