జాతీయ వార్తలు

చికిత్సపై వీడియో కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ తీవ్రం కావడం తో కేంద్ర ఆరోగ్య శాఖ విస్తృత స్థాయి లో కీలక వైద్య చికిత్స చర్యలను చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివా రం దాదాపు వెయ్యి ప్రాంతాల్లో ఈ శిక్ష ణ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైరస్ కేసులు తీవ్రమయ్యే పక్షంలో అత్యవసరంగా ఏ విధంగా స్పందించాలన్న దానిపై ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణను అందించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర వైద్య శాఖ సంయుక్త కార్యదర్శి వీటి వివరాలను తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించామని, ఏయే కేసులను ఏయే సందర్భాల్లో ఎన్ని రోజుల వ్యవధిలో పరీక్షించాలన్న దానిపై వివరాలు అందించామని తెలిపారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఐదో రోజు, 14వ రోజు పరీక్షలు జరపాలని స్పష్టం చేశారు. ప్రైవేటు లేబరేటరీకి సంబంధించి కూడా విడిగా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. వైరస్ లేకపోయినా ఓ ప్యాషన్‌గా ప్రజలు ఈ రకమైన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని, అలాగే ఈ లక్షణాలు కనిపిస్తేనే తప్ప పరీక్షించుకోవాలి తప్ప తమకు ఈ వైరస్ లేదు అన్న ధీమా కోసం ఇందుకు పాల్పడకూడదని వైద్య సంయుక్త కార్యదర్శి తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా రక్షిత మాస్క్‌లు, శానిటైజర్ల ఉత్పత్తిని పెంచుతున్నామని, ఇందుకు డియోడరన్ ఉత్పత్తిదారులను కూడా అనుమతించాలని రాష్ట్రాలను కోరామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం దేశంలో రక్షిత మాస్క్‌లు, శానిటైజర్ల కొరత లేదని ఇవి దొరకవేమోనన్న భయంతో ఎగబడి కొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మాస్క్ లు ఎవరు వేసుకోవాలన్న దానిపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉం దని, అందరూ వీటిని ఖచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అన్నింటి కంటే ముఖ్యం వ్యక్తులతో తగిన దూరాన్ని పాటించాలని వైద్య కార్యదర్శి తెలిపారు. కాగా విదేశాల్లో ఉంటున్న 1700 మంది భారతీయులను ఇప్పటి వరకు స్వదేశానికి తీసుకుని వచ్చామని, రోమ్ నుంచి మెజారిటీ విద్యార్థులతో కూడిన మరో 262 మందిని వెనక్కి తెస్తామని తెలిపారు. వైరస్ సోకిన వారితో సంబంధం ఉందన్నట్లుగా భావిస్తున్న 7 వేల మంది కోసం గాలింపు చేస్తున్నామన్నారు.