జాతీయ వార్తలు

జనతా కర్ఫ్యూతో కరోనాను నిర్మూలిద్ధాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఆదివారం (22న) ఇంటిలోనే ఉండిపోవడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని దెబ్బ తీయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శనివారం పిలుపు ఇచ్చారు. ఒకరినొకరు ముట్టుకోవడం, తగలడం వల్ల కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనిని సమర్థంగా అరికట్టేందుకు సామాజిక దూరాన్ని పాటించటం మంచి విధానమని ఆయన సూచించారు. జనతా కర్ఫ్యూను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా కాపాడేందుకు అవకాశం కల్పిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయవచ్చునని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ఇతరులు స్వచ్చందంగా ముందుకు వచ్చి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం ద్వారా దేశానికి సవాలుగా మారిన కరోనావైరస్‌తో పోరాడాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు సూచించారు. కరోనా వైరస్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఇతరులను ప్రోత్సహించి సిద్ధం చేయడం దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత, కర్తవ్యమని ఆయన తెలిపారు. మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ను ఎదుర్కొవడం మనందరి ప్రథమ కర్తవ్యమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
*చిత్రం... ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు