జాతీయ వార్తలు

జెఎన్‌యు కొత్త రిజిస్ట్రార్‌గా ప్రమోద్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: వివాదంలో చిక్కుకున్న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)కి కొత్త రిజిస్ట్రార్‌ను నియమించారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న భూపీందర్ జుట్షీ పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండటంతో ఆయన స్థానంలో నియమించేందుకు ఢిల్లీ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్‌ను త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది. జెఎన్‌యు పూర్వ విద్యార్థి అయిన ప్రమోద్ కుమార్ 21న జెఎన్‌యు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జెఎన్‌యు తదుపరి రిజిస్ట్రార్‌గా తనను ఎంపిక చేసినట్లు సమాచారం అందిందని, సోమవారం ఆ పదవీ బాధ్యతలు స్వీకరిస్తానని ప్రమోద్ కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.