జాతీయ వార్తలు

కొనుగోళ్లకు తెరతీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 16: కర్నాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించడానికి అవసరమయ్యే ఎమ్మేల్యేల కొనుగోలుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన జెడి(ఎస్)కు మొత్తం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున గవర్నర్ వాజుభాయి వాలా వెంటనే తమను పిలిచి అధికారం చేపట్టేలా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జెడి(ఎస్)కు తాము మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు విభేదిస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టివేశారు. కాంగ్రెస్, జెడి(ఎస్) పొత్తు నేపథ్యంలో ఇరుపార్టీలకు కలిసి 116 మంది ఎమ్మెల్యే లున్నారు. దీంతో తమను అధికారంలోకి ఆహ్వానించాలని ఆ రెండు పార్టీలు గవర్నర్‌ను కోరాయి.
అధికార దుర్వినియోగం: సీపీఎం
న్యూఢిల్లీ: కర్నాటక గవర్నర్ తనకు రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐఎం విమర్శించింది. బీజేపీ కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ బీజేపీకి లేదన్నారు. వీలైనంత ఎక్కువ గడువు ఇవ్వడం ద్వారా అడ్డదార్ల ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపికి అవకాశం ఇచ్చినట్లవుతుందని సిపిఐఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. అప్రజాస్వామిక చర్యలకు బీజేపి పాల్పడుతోందన్నారు. గోవాలో 40 అసెంబ్లీ సీట్లలో బిజెపికి 13, కాంగ్రెస్‌కు 17 సీట్లు వస్తే, బిజెపిని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలిచారని సిపిఐఎం పేర్కొంది. ఎన్నికల తర్వాత బీజేపీ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. మణిపూర్, మేఘాలయలో కూడా బీజేపికి సొంతంగా మెజార్టీ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్లు ఆహ్వానించారన్నారు.
ఫిరాయిస్తే వేటు వేయాలి: ఒమర్
ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక టర్మ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల రాజకీయ బేరసారాలకు పార్టీలు పాల్పడుతున్నాయన్నారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం తెలియదని, కాని కాంగ్రెస్ ప్రయత్నాలను మాత్రం విమర్శించరాదన్నారు. ఒక వేళ బిజెపి కాంగ్రెస్ స్థానంలో ఉన్న జేడీఎస్‌కు మద్దతు ఇచ్చేదన్నారు.
ప్రజాతీర్పును గౌరవించండి
జెడి(ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆరోపించడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తీర్పు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న సంగతి మరువరాదని,ప్రజలు తీర్పు గౌరవించాలని అన్నారు. సిద్ధరామయ్య పరిస్థితి ఆడలేక మద్దెలోడు’ అన్నట్టుగా ఉందని ఆయన అన్నారు. ఆయన పోటీ చేసిన రెండుస్థానాల్లో ఒకదానిలో ఘోరంగా ఓడిపోగా, మరోదానిలో ‘చావుతప్పి కన్నులొట్టపోయిన’ చందాన గెలిచాడని రవిశంకర్ విమర్శించారు.