జాతీయ వార్తలు

సూక్ష్మ నీటిపారుదలకు రూ.5వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: దేశంలో సూక్ష్మ నీటిపారుదల రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాబార్డ్‌లో రూ.5వేల కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజన కింద సూక్ష్మ నీటిపారుదల నిధిని ఏర్పాటు చేస్తున్నారు. 2018-19లో రెండువేల కోట్లు, 2019-20 సంవత్సరంలో మూడువేల కోట్ల రూపాయలను నాబార్డ్ ద్వారా వివిధ రాష్ట్రాలలో సూక్ష్మ సేద్యం పథకాలకు కేటాయిస్తారు. నాబార్డ్ ఈ నిధి నుండి ఆయా రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేస్తుంది. తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఏడేళ్లతోపాటు మరో రెండేళ్ల గ్రేస్ పిరేడ్‌తో కలిపి చెల్లించవలసి ఉంటుంది. సంవత్సరానికి మూడు రూపాయల వడ్డీ రేటుతో ఈ నిధి నుండి రుణాలు మంజూరు చేస్తారు. నాబార్డ్ నుండి నేరుగా తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధిని ఏర్పాటు చేయటం వలన కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.750 కోట్ల భారం పడుతుంది.

వాణిజ్య తగాదాల పరిష్కార వ్యవస్థ
పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య తలెత్తే వాణిజ్యపరమైన తగాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది అత్యంత ముఖ్యమైన నిర్ణయమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేఖరులతో చెప్పారు. ఈ వ్యవస్థ ఏర్పాటైన తరువాత పబ్లిక్ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు తమ మధ్య తలెత్తే తగాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించేందుకు వీలుండదు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం పబ్లిక్ రంగ సంస్థల, ప్రభుత్వ సంస్థల మధ్య వాణిజ్యపరమైన తగాదాలు చోటు చేసుకున్నప్పుడు మొదట వివాదం తలెత్తిన సంస్థల కార్యదర్శులు సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ స్థాయిలో పరిష్కారం లభించకపోతే సమస్య క్యాబినెట్ కార్యదర్శి సమక్షానికి వెళుతుంది. అప్పుడు క్యాబినెట్ కార్యదర్శి తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. క్యాబినెట్ కార్యదర్శి తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు వీలుకూడా ఉండదు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో పబ్లిక్‌రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు తమ మధ్య తలెత్తే సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు వీలు కలుగుతుంది. దానివలన కోర్టులపై భారం కూడా తగ్గుతుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

మానసిక వైద్య సంస్థ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జాతీయ మానసిక ఆరోగ్యం, పునరావాస సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 180కోట్ల వ్యయంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తారు. మానసిక సమతుల్యం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.