జాతీయ వార్తలు

అది ఊహాజనితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 16: అధికారంలోకి రావడానికి అవసరమయ్యే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వారి పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని జెడి(ఎస్) చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. ఇది కేవలం ఊహాజనితమని ఆయన వ్యాఖ్యానించారు. వంద కోట్లు, 200 కోట్లు అన్నవి కేవలం అన్నది కేవలం ఊహాజనితమే, వాస్తవానికి బీజేపీ అలాంటి చర్యలకు పాల్పడదని జవదేకర్ అన్నారు. అలాంటి రాజకీయాలకు కాంగ్రెస్, జెడి(ఎస్)లే పాల్పడతాయని ఆయన ఆరోపించారు. అసలు ఆ రెండు పార్టీల కలయికే అపవిత్రమని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎలాంటి కొనుగోళ్లకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్ణయించిన విధివిధానాల మేరకే తమ పార్టీ నడుచుకుంటుందని, దాని ప్రకారమే కర్నాటకలో అధికారం చేపడతామని మంత్రి అన్నారు. తమను అధికారానికి పిలవాలని ఇప్పటికే గవర్నర్ వాజుభాయి వాలాను తమ పార్టీ కోరిందని, తమని గవర్నర్ ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘మేము కర్నాటకలో అధికారం చేపడతాం, స్థిరమైన పాలను అందిస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ బీజేపీని కనుక అధికార పీఠం పైకి ఆహ్వానిస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ చేస్తున్న హెచ్చరికలపై ఆయన స్పందిస్తూ ‘ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కోర్టే కాదు, దేనినైనా ఆశ్రయించవచ్చు, అది వారి హక్కు’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు జెడి(ఎస్) నేత కుమారస్వామి విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వందకోట్ల రూపాయలు పెట్టి కొనడానికి ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణ చేశారు. ఆ డబ్బు బ్లాక్ మనీయా, వైట్ మనీయా తెలియజేయాలని ఆయన బీజేపీని డిమాండ్ చేశారు.