జాతీయ వార్తలు

ఆ గొంతు నా భార్యది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 21: కర్నాటకలో యెడ్యూరప్ప బలపరీక్షకు ముందు బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ఆశచూపారని పేర్కొంటూ, ఆ మేరకు వారి సంభాషణల ఆడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఇప్పటికే వైరల్ అయిన ఆడియోక్లిప్‌లు నకిలీవని సాక్షాత్తూ ఆ పార్టీ శాసనసభ్యుడే స్పష్టం చేయడంతో బలపరీక్షకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్రమమార్గం అనుసరించిందన్న విమర్శలు వస్తున్నాయి. బలపరీక్షకు ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ భార్యకు ఫోన్ వచ్చిందని, అందులో ‘నీ భర్త శివరామ్ మా పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే పెద్దమొత్తంలో డబ్బు, మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రలోభపెట్టారని’ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఆడియో సంభాషణల్లో శివరామ్ హెబ్బార్ ఆ పార్టీలో ఉంటూనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే 15 కోట్లు ఇస్తామని, అలా కాదనుకుంటే ఐదు కోట్ల రూపాయలతో పాటు మంత్రి పదవి ఇస్తామని, అంతేకాకుండా శివరామ్ భార్య, అతని కుమారుడిపై ఉన్న కేసులను రద్దు చేయిస్తామని ప్రలోభపెట్టారు. ఈ మేరకు శివరామ్ భార్య, బీజేపీ నేతలకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినదని చెబుతున్న ఆడియో క్లిప్‌ను విడుదల చేయడంతో అది వైరల్ అయ్యింది. దీనిపై శివరామ్ హెబ్బార్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘అసలు ఆ ఆడియోలో ఉన్నది నా భార్య గొంతే కాదు, నా భార్యకు బీజేపీ కాని, ఇతరుల నుంచి అలాంటి ఫోన్ కాల్ ఏమీ రాలేదు, ముమ్మాటికీ ఆ ఆడియో టేపు నకిలీదే, దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని స్పష్టం చేశారు. దీంతో యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని ప్రధాన అనుచరుడు పుట్టుస్వామి హెబ్బార్ భార్యకు ఫోన్ చేశారని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి, బీజీపీ కర్నాటక ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవడేకర్ ఈ ఆడియోలు నకిలీవని అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు హెబ్బార్ వివరణతో అది వాస్తవమేనని నిర్ధారణ కానుంది.